తెలంగాణ

telangana

ETV Bharat / sports

ద్యుతిచంద్​కు కరోనా కష్టాలు.. అమ్మకానికి లగ్జరీ కారు! - కారు అమ్మేయనున్న ద్యుతిచంద్‌

కరోనా వల్ల తాను ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపింది భారత స్ప్రింటర్​ ద్యుతి చంద్. స్పాన్సర్లు కూడా ముందుకు రావట్లేదని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో వచ్చే ఏడాది జరగబోయే టోక్యో ఒలింపిక్స్​కు శిక్షణ ఖర్చుల కోసం తన లగ్జరీ కారు బీఎమ్​డబ్లూ-3 సిరీస్​ మోడల్​ను అమ్మకానికి పెట్టింది.

dutee
ద్యుతిచంద్‌

By

Published : Jul 11, 2020, 5:03 PM IST

Updated : Jul 11, 2020, 6:07 PM IST

కరోనా వల్ల క్రీడాకారులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా తాను కూడా ఈ వైరస్ వల్ల ఆర్థిక కష్టాలను అనుభవిస్తున్నట్లు తెలిపింది భారత స్ప్రింటర్​ ద్యుతి చంద్. వచ్చే ఏడాదికి వాయిదా పడ్డ ​ టోక్యో ఒలింపిక్స్‌కు ప్రస్తుతం శిక్షణ పొందడానికి నిధుల కొరతతో సతమతమవుతున్నట్లు వెల్లడించింది. స్పాన్సర్లు కూడా ముందుకు రావట్లేదని ఆవేదన వ్యక్తం చేసింది.

ద్యుతి

అమ్మకానికి కారు

ఈ కష్టాల నుంచి తాత్కాలికంగా గట్టెక్కడానికి, తన శిక్షణ ఖర్చుల కోసం గత్యంతరం లేక రూ.30 లక్షల విలువగల తన లగ్జరీ కారు బీఎమ్​డబ్ల్యూ-3 సిరీస్​ మోడల్​ను అమ్మేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు ట్విట్టర్​లో తన కారు ఫొటోలను పోస్ట్​ చేసింది. వెంటనే మళ్లీ ఆ పోస్టును డిలీట్ చేసింది.

టైన్​ కేంద్రంగా ఈడెన్​ గార్డెన్స్​.. ఎవరి కోసమంటే?

Last Updated : Jul 11, 2020, 6:07 PM IST

ABOUT THE AUTHOR

...view details