తెలంగాణ

telangana

ETV Bharat / sports

టైమ్​ మ్యాగజైన్ '100 నెక్స్ట్​' జాబితాలో ద్యుతికి చోటు - time magazine top100 dutee

ప్రఖ్యాత టైమ్​ మ్యాగజైన్​ 100 నెక్స్ట్​ జాబితాలో చోటు సంపాదించింది భారత స్ప్రింటర్ ద్యుతి చంద్. ప్రపంచంలో అత్యధిక మందిని ప్రభావితం చేసే 100 మంది ప్రముఖుల జాబితాకు అనుబంధంగా ఈ చిట్టాను రూపొందించింది టైమ్.

ద్యుతి చంద్

By

Published : Nov 14, 2019, 10:32 AM IST

భారత స్ప్రింటర్ ద్యుతి చంద్​కు అరుదైన గౌరవం లభించింది. ప్రపంచంలో అత్యధిక మందిని ప్రభావితం చేసే వంద మందిని ప్రముఖుల జాబితాలో స్థానం దక్కించుకుంది. ఏటా టైమ్ మ్యాగజైన్ విడుదల చేసే టాప్-100 జాబితాతో కొనసాగింపుగా టైమ్100 నెక్స్ట్​ పేరుతో రూపొందించే లిస్ట్​లో చోటు సంపాదించింది ద్యుతి.

ఈ గౌరవం పట్ల ఆనందం వ్యక్తం చేసింది ద్యుతి చంద్.

"టైమ్ మ్యాగజైన్​ నన్ను గుర్తించి ఈ గౌరవాన్ని ఇచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది. లింగ సమానత్వాన్ని గట్టిగా నమ్ముతా. క్రీడల్లో బాలికలు, మహిళల హక్కుల కోసం నా పోరాటాన్ని ఇలాగే కొనసాగిస్తా. సమాజంలో వారిపై జరుగుతున్న అకృత్యాలపై పోరాడతా" - ద్యుతి చంద్, భారత స్ప్రింటర్

భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలుస్తూ.. ప్రజలను ప్రభావితం చేసే టాప్-100 మంది రైజింగ్ స్టార్స్​ను టైమ్ మ్యాగజైన్ ఏటా ఎంపిక చేస్తుంది. వ్యాపారం, వినోదరంగం, క్రీడలు, రాజకీయాలు, ఆరోగ్యం, సైన్స్ తదితర రంగాల్లో రాణించిన ప్రముఖులకు ఈ లిస్టులో చోటు కల్పిస్తుంది. ఈ జాబితా పాటు టైమ్ 100 నెక్స్ట్​​ జాబితానూ విడుదల చేస్తుంది.

ఇండోనేసియా జకర్తా వేదికగా జరిగిన ఆసియా క్రీడల్లో ద్యుతి చంద్ పతకాలు సాధించింది. 100, 200 మీటర్ల రేసులో రెండు రజతాలు నెగ్గింది. నాపోలీ వేదికగా జరిగిన యూనివర్శేడ్ టోర్నీలోనూ స్వర్ణం నెగ్గి.. ఈ ఘనత సాధించిన భారత తొలి స్ప్రింటర్​గా రికార్డు సృష్టించింది.

ఇదీ చదవండి: టాస్ గెలిచిన బంగ్లా.. భారత్ బౌలింగ్

ABOUT THE AUTHOR

...view details