తెలంగాణ

telangana

ETV Bharat / sports

తన రికార్డు తానే అధిగమించిన స్ప్రింటర్ ద్యుతి - ద్యుతిచంద్

రాంచీ వేదికగా జరిగిన జాతీయ ఓపెన్​ అథ్లెటిక్స్ ఛాంపియన్​షిప్స్​లో రన్నర్​ ద్యుతిచంద్.. 100 మీటర్ల విభాగం సెమీస్​లో జాతీయ రికార్డు నెలకొల్పింది. ఫైనల్​లో పసిడి గెలుచుకుంది.

తన రికార్డు తానే అధిగమించిన స్ప్రింటర్ ద్యుతి

By

Published : Oct 12, 2019, 8:05 AM IST

భారత అగ్రశ్రేణి స్ప్రింటర్‌ ద్యుతిచంద్‌.. మరోసారి జాతీయ రికార్డు బద్దలు కొట్టింది. శుక్రవారం జరిగిన జాతీయ ఓపెన్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌ మహిళల 100మీటర్ల విభాగంలో సెమీస్‌ రేసును 11.22 సెకన్లలో పూర్తి చేసింది. ఇప్పటివరకు తన పేరిటే ఉన్న రికార్డు (11.26సె)ను తిరగరాసింది.

ఇటీవలే దోహాలో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో సెమీస్‌ చేరడంలో విఫలమైన ద్యుతి.. జాతీయ ఛాంపియన్‌షిప్స్‌లో మాత్రం మెరుగైన ప్రదర్శన చేసింది.ఫైనల్‌ రేసును 11.25సె టైమింగ్‌తో ముగించి పసిడి సొంతం చేసుకుంది. అర్చన, హిమశ్రీ తర్వాతి స్థానాల్లో నిలిచారు. పురుషుల 100మీటర్ల పరుగులో అమియా కుమార్‌ మాలిక్‌ (ఒడిషా) 10.46 సెకన్లలో రేసు పూర్తి చేసి బంగారు పతకం గెలుచుకున్నాడు. పురుషుల 400మీ. హార్డిల్స్‌లో జబీర్‌ (ఏఎఫ్‌ఐ) అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details