ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్(Tokyo Olympics) త్వరలో ప్రారంభం కానుంది. ఇందులో పాల్గొనే అథ్లెట్లకు శిక్షణ విషయంలోనే కాకుండా సోషల్‌మీడియా వల్ల కూడా మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది! ఎందుకంటే ఈ మెగాక్రీడల్లో భారత్ చివరిసారిగా 2008లో స్వర్ణం సాధించింది. 10మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్ అభినవ్ బింద్రా ఈ గోల్డ్‌మెడల్‌ను సాధించాడు. ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు మన ప్లేయర్స్ ఎవరూ గోల్డ్ సాధించలేకపోయారు. దీంతో ఈ సారైనా మన అథ్లెట్లు స్వర్ణం అందుకుంటారని కోట్లాదిమంది ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. సోషల్‌మీడియా వేదికగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. దీంతోపాటే మరికొంతమంది ప్రతికూల కామెంట్లతో ఆటగాళ్లను నిరుత్సాహపరిచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇవన్నీ చూసినప్పుడు అభిమానుల అంచనాలకు చేరుకుంటామో లేదో అన్న అలోచనలతో క్రీడాకారులపై మానసికంగా ఒత్తిడి పెరుగుతోంది! ఈ నేపథ్యంలో వారు ఈ సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్‌లకు దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు!
తానూ ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటున్నానని ఒలింపిక్స్‌కు(Tokyo Olympics) అర్హత సాధించిన భారత స్టార్ స్ప్రింటర్ ద్యుతి చంద్(Dutee chand) చెప్పింది. సోషల్‌మీడియా చూస్తుంటే భయంగా ఉందని అంటోంది. తనపై మానసిక ఒత్తిడి తీవ్రంగా పెరుగుతుందని, అందుకే సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండడానికే చాలా ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంది.
"సాధారణంగా ఏం ఒత్తిడి అనిపించదు. కానీ సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్‌లు ఇన్‌స్టా, ట్విట్టర్ తెరవగానే ఒత్తిడి ఎక్కవైపోతుంది. 'ద్యుతి ఓడిపోతుంది', 'ద్యుతి మీదే ఆశలు పెట్టుకున్నాం.. పతకం సాధిస్తుంది' ఇలా ఎన్నో కామెంట్లు చూస్తుంటే మానసికంగా ఒత్తిడికి పెరిగిపోతుంది. అందుకే సామాజిక మాధ్యమాలను చూడట్లేదు." అని ద్యుతి చెప్పింది. అయితే ద్యుతి మాత్రమే కాదు ఎంతోమంది అథ్లెట్లు ఇటీవలే పలు సందర్భాల్లో ఈ విధంగానే చెప్పుకొచ్చారు.
వెనకడుగు వేయలేదు