తెలంగాణ

telangana

ETV Bharat / sports

Dubai Tennis Championships: సెమీఫైనల్లోకి సానియా జోడీ - సానియా మీర్జా లూసీ హర్దెకా జోడీ

Dubai Tennis Championships: దుబాయ్​ టెన్నిస్​ ఛాంపియన్​షిప్స్​లో సానియా మీర్జా- లూసీ హర్దెకా జోడీ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. క్వార్టర్స్​లో షుకో- అలెక్సాండ్రా క్రునిక్​ ద్వయంపై విజయం సాధించింది.

Dubai Tennis Championships
దుబాయ్​ టెన్నిస్​ ఛాంపియన్​షిప్స్

By

Published : Feb 18, 2022, 7:22 AM IST

Dubai Tennis Championships: సానియా మీర్జా, లూసీ హర్దెకా (చెక్‌) జంట దుబాయ్‌ టెన్నిస్‌ ఛాంపియన్‌షిప్‌ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది.

గురువారం జరిగిన క్వార్టర్‌ఫైనల్లో ఈ జంట 7-5, 6-3తో శుకో ఒయమా (జపాన్‌), అలెగ్జాండ్రా క్రునిచ్‌ (సెర్బియా) ద్వయంపై విజయం సాధించింది.

సానియా జంట ఈ టోర్నమెంట్లో వైల్డ్‌కార్డ్‌తో బరిలోకి దిగింది. సానియా 2013లో ఇక్కడ బెతానీ మాటెక్‌ (అమెరికా)తో కలిసి టైటిల్‌ గెలిచింది. 35 ఏళ్ల సానియా.. 2022 తనకు చివరి సీజన్‌ అని ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇదీ చూడండి:జోష్​లో టీమ్​ ఇండియా.. టీ20 సిరీస్​పై విజయంపై దృష్టి

ABOUT THE AUTHOR

...view details