Djokovic Australian Open: సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్ వీసాను మరోసారి రద్దు చేసింది ఆస్ట్రేలియా ప్రభుత్వం. వ్యాక్సినేషన్ ఆధారాలు చూపనందుకు వీసా రద్దు చేశారు అధికారులు. ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయం అనంతరం.. ఓ స్థానిక కోర్టు మరోసారి తీర్పు వెలువరించింది. జకోవిచ్‌ను వెంటనే తిరిగివెళ్లమనడానికిలేదని ఆదేశించింది. సెర్బియా స్టార్ తన లాయర్లతో కలిసి శనివారం ఉదయం ఇమ్మిగ్రేషన్ అధికారుల ఎదుట హాజరుకావాలని తెలిపింది.
ఇదీ జరిగింది..
Djokovic Visa: తొలుత.. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పాల్గొనేందుకు మెల్బోర్న్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాడు జకోవిచ్. సరైన వీసా అనుమతులు, వైద్యపరమైన మినహాయింపులున్నా.. వాక్సినేషన్‌కు సంబంధించిన ధ్రువపత్రాలు లేని కారణంగా ఆస్ట్రేలియా బోర్డర్ ఫోర్స్ అధికారులు అతడిని అడ్డుకున్నారు. జకోవిచ్ వీసాను రద్దు చేసి డిటెన్షన్ సెంటర్లో ఉంచారు. ఈ విషయం పెద్ద చర్చనీయాంశంగా మారగా.. అక్కడే ఉన్న జకోవిచ్ ఆస్ట్రేలియా తీరుపై న్యాయపరమైన చర్యలకు ఉపక్రమించాడు. ఈ క్రమంలోనే తన లాయర్ల ద్వారా వాదనలు వినిపించాడు జకోవిచ్. దీనిపై తీర్పు వెలువరించింది ఫెడరల్ కోర్టు. ఆస్ట్రేలియా ఓపెన్‌లో పాల్గొనేందుకు వచ్చిన ఇతడి వీసాను వాక్సినేషన్‌కు సంబంధించిన ధ్రువపత్రాలు లేని కారణంగా ఆస్ట్రేలియా బోర్డర్ ఫోర్స్ అధికారులు రద్దు చేయడాన్ని తప్పుబట్టింది. వెంటనే అతడిని మెల్బోర్న్ క్వారంటైన్ నుంచి విడుదల చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
అయితే.. ఆస్ట్రేలియా సర్కారు మరోసారి జకోవిచ్ వీసాను రద్దు చేయడం గమనార్హం.
ఇవీ చూడండి: కరోనా సోకిన మరునాడే టోర్నీలో.. జకోవిచ్ తీరుపై విమర్శలు