తెలంగాణ

telangana

ETV Bharat / sports

నంబర్​ వన్​గానే బరిలోకి జకోవిచ్.. ప్రాక్టీస్​ షురూ.. - జకోవిచ్ న్యూస్ టుడే

Djokovic Australian Open 2022: ఆస్ట్రేలియా ఓపెన్​ త్వరలోనే ప్రారంభం కానున్న నేపథ్యంలో సెర్బియా ఆటగాడు నొవాక్ జకోవిచ్​ నంబర్​ వన్ ఆటగాడిగానే బరిలోకి దిగనున్నాడు. ఈ మేరకు టోర్నీ నిర్వాహకులు టాప్​ సీడ్​ ఆటగాళ్ల జాబితాను విడుదల చేశారు. మరోవైపు జకోవిచ్​.. టోర్నీలో పాల్గొనేందుకు ప్రాక్టీస్ ప్రారంభించాడు.

djokovic
జకోవిచ్

By

Published : Jan 11, 2022, 5:01 PM IST

Djokovic Australian Open 2022: ప్రముఖ టెన్నిస్‌ స్టార్‌, ప్రపంచ నంబర్‌ వన్‌ ఆటగాడు నొవాక్‌ జకోవిచ్‌ ఎట్టకేలకు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ కోసం ప్రాక్టీస్‌ మొదలెట్టాడు. ఈ టోర్నీలో పాల్గొనేందుకు గత బుధవారం మెల్‌బోర్న్‌ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న అతడు అనూహ్య పరిణామాల మధ్య కోర్టును ఆశ్రయించాడు. చివరికి కేసు గెలిచి రాడ్‌ లావర్‌లోని టెన్నిస్‌ కోర్టులో సాధన ప్రారంభించాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా ట్విటర్‌లో అభిమానులతో పంచుకొని సంతోషం వ్యక్తం చేశాడు.

ఈ సెర్బియన్‌ ఆటగాడు గతవారం ఆస్ట్రేలియాలో అడుగుపెట్టగానే బోర్డర్‌ ఫోర్స్ అధికారులు అడ్డుకున్నారు. వాక్సినేషన్‌కు సంబంధించిన సరైన ధ్రువపత్రాలు లేనందున అతడి వీసాను రద్దు చేయడంతో పాటు, అతడిని ఇమ్మిగ్రేషన్‌ నియంత్రణలోని ప్రత్యేక హోటల్‌కు తరలించారు. ఈ నేపథ్యంలోనే న్యాయపోరాటం చేసిన జకోవిచ్‌ తాజాగా కేసు గెలిచాడు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో పాల్గొనేందుకు అతడి వద్ద వైద్యపరమైన మినహాయింపులకు సంబంధించిన అన్ని పత్రాలు ఉన్నాయని, దీంతో అతడి వీసాను పునరుద్ధరించాలని న్యాయమూర్తి ఆంటోని కెల్లీ ఆదేశాలిచ్చారు. ఈ క్రమంలోనే జకోవిచ్‌ ఇప్పుడు తిరిగి మైదానంలో అడుగు పెట్టాడు. ఇక పదోసారి ఆస్ట్రేలియన్‌ టైటిల్‌ కైవసం చేసుకొని తన కెరీర్‌లో 21వ గ్రాండ్‌ స్లామ్‌ సాధించాలని ఆసక్తిగా ఉన్నాడు.

టాప్ సీడ్ ఆటగాళ్లు వీరే..

ఆస్ట్రేలియన్ ఓపెన్ త్వరలోనే ప్రారంభంకానున్న నేపథ్యంలో టాప్​ సీడ్​ ఆటగాళ్ల జాబితాను విడుదల చేశారు గ్రాండ్ స్లామ్ టోర్నీ నిర్వాహకులు. పురుషుల జాబితాలో సెర్బియా స్టార్ షట్లర్ నొవాక్​ జకోవిచ్​కు, మహిళల జాబితాలో ఆస్ట్రేలియాకు చెందిన ఆష్లీ బార్టీకి నంబర్ వన్​ స్థానం ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details