తెలంగాణ

telangana

ETV Bharat / sports

కరోనా సోకిన మరునాడే టోర్నీలో.. జకోవిచ్ తీరుపై విమర్శలు - జకోవిచ్ కరోనా టెస్టు

Djokovic Corona: నెంబర్ వన్ టెన్నిస్ ఆటగాడు నోవాక్ జకోవిచ్​ ఆస్ట్రేలియా ఓపెన్​లో పాల్గొనేందుకు వెళ్లగా వాక్సినేషన్‌కు సంబంధించిన ధ్రువపత్రాలు లేని కారణంగా అతడిని ఎయిర్​పోర్ట్ అధికారులు అడ్డుకున్నారు. అక్కడే ఉన్న జకోవిచ్‌ ఆస్ట్రేలియా అధికారుల తీరుపై న్యాయపరమైన చర్యలకు ఉపక్రమించాడు. ఈ క్రమంలోనే శనివారం తన లాయర్ల ద్వారా వాదనలు వినిపించాడు జకోవిచ్. డిసెంబర్ 16న అతడికి కరోనా సోకిందని అందుకే మినహాయింపు ఇవ్వాలని లాయర్లు కోరారు. కానీ డిసెంబర్ 17న అతడు మాస్క్ లేకుండా పలు ఈవెంట్లలో పాల్గొనడం ఇప్పుడు చర్చనీయాశంగా మారింది.

Novak Djokovic news, జకోవిచ్ న్యూస్
Djokovic

By

Published : Jan 9, 2022, 8:38 AM IST

Djokovic Corona: టెన్నిస్ నంబర్‌ వన్‌ క్రీడాకారుడు నోవాక్‌ జకోవిచ్‌ డిసెంబర్​లో కొవిడ్‌-19 బారిన పడినట్లు ఇతడి తరఫున లాయర్లు శనివారం మెల్‌బోర్న్‌లోని ఫెడరల్‌ కోర్టుకు విన్నవించారు. అందువల్లే అతడికి 'ఆస్ట్రేలియా ఓపెన్‌'లో పాల్గొనడానికి వైద్యపరమైన ప్రత్యేక మినహాయింపు ఇచ్చారని తెలిపారు. అయితే అతడికి కరోనా సోకిన మరుసటి రోజే ఓ టోర్నమెంట్​కు హాజరవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

ఏం జరిగిందంటే!

బెల్​గ్రేడ్ ఈవెంట్​లో జకోవిచ్

డిసెంబర్ 16న జకోవిచ్​కు కరోనా సోకిందని ఇతడి తరఫున లాయర్లు మెల్‌బోర్న్‌లోని ఫెడరల్‌ కోర్టుకు విన్నవించారు. అందుకే ఆస్ట్రేలియా ఓపెన్​లో పాల్గొనడానికి వైద్యపరమైన ప్రత్యేక మినహాయింపు ఇచ్చారని తెలిపారు. అయితే అదే నెల 17న జకోవిచ్​.. బెల్​గ్రేడ్​లో జరిగిన ఓ ఈవెంట్​లో పాల్గొన్నాడు. ఈ సమయంలో ఇతడు మాస్క్ కూడా ధరించలేదు. దీనికి సంబంధించిన ఫొటోలను బెల్​గ్రేడ్ టెన్నిస్ సమాఖ్య సామాజిక మాధ్యమాల్లోనూ పోస్ట్ చేసింది. ఇందులో యువ ఆటగాళ్లకు ట్రోఫీలు అందిస్తూ కనిపించాడు జకో. అలాగే అదే రోజు మరో ఈవెంట్​లో పాల్గొన్నాడు ఈ టెన్నిస్ ఆటగాడు. సెర్బియా జాతీయ పోస్టల్ కార్యాలయంలో ఇతడి ముఖచిత్రంతో ఉన్న పోస్టల్ స్టాంప్​ విడుదల కార్యక్రమానికి హాజరయ్యాడు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను జకో తన ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్ చేశాడు. దీంతో ఇప్పుడు ఈ టాపిక్​ క్రీడావర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది.

జకోవిచ్ వీసా రద్దు

జకోవిచ్‌ ఈ సీజన్‌లో తొలి గ్రాండ్ స్లామ్‌ టోర్నీ అయిన 'ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌'లో పాల్గొనేందుకు నాలుగు రోజుల క్రితం మెల్‌బోర్న్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాడు. అతడికి సరైన వీసా అనుమతులు, వైద్యపరమైన మినహాయింపులున్నా.. వాక్సినేషన్‌కు సంబంధించిన ధ్రువపత్రాలు లేని కారణంగా ఆస్ట్రేలియా బోర్డర్‌ ఫోర్స్‌ అధికారులు అడ్డుకున్నారు. జకోవిచ్‌ వీసాను రద్దు చేసి డిటెన్షన్‌ సెంటర్‌లో ఉంచారు. ఈ విషయం పెద్ద చర్చనీయాంశంగా మారగా.. అక్కడే ఉన్న జకోవిచ్‌ ఆస్ట్రేలియా తీరుపై న్యాయపరమైన చర్యలకు ఉపక్రమించాడు. ఈ క్రమంలోనే శనివారం తన లాయర్ల ద్వారా వాదనలు వినిపించాడు జకోవిచ్.

'జకోవిచ్​కు డిసెంబర్​లో కరోనా సోకింది.. అందుకే ఇలా'

ABOUT THE AUTHOR

...view details