తెలంగాణ

telangana

ETV Bharat / sports

కోచ్ లేకుండా ఆడమంటే ఎలా?: దీపికా పల్లికల్ - deepika pallikal

గతేడాది ఏప్రిల్ నుంచి కోచ్​ నియామకంలో స్క్వాష్ ఫెడరేషన్ విఫలమైందని మండిపడింది స్క్వాష్ ప్లేయర్ దీపికా పల్లికల్. ఈ తరహా విధానంతో ఆటగాళ్లు నిరుత్సాహపడతారని చెప్పింది.

దీపికా పల్లికల్

By

Published : Sep 14, 2019, 5:20 AM IST

Updated : Sep 30, 2019, 1:14 PM IST

భారత స్క్వాష్ ప్లేయర్ దీపికా పల్లికల్ ఎస్​ఆర్​ఎఫ్​ఐ(స్క్వాష్ రాకెట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా)పై విరుచుకుపడింది. గతేడాది ఏప్రిల్ నుంచి కోచ్​ నియామకంలో ఫెడరేషన్ విఫలమైందని మండిపడింది. స్క్వాష్ ప్లేయర్లకు ఇది చాలా నిరుత్సాహం కలిగించే విషయమని తెలిపింది.

"స్క్వాష్​ను ముందుకు తీసుకెళ్లాలంటే చేయాల్సిన మొదటి పని కోచ్​ను నియమించడం. గతేడాది కామన్ వెల్త్, ఆసియా క్రీడల నుంచి ఇప్పటివరకు కోచ్​ను నియమించకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ఈ విధానం ఆటగాళ్లను నిరుత్సాహపరుస్తుంది. ప్రపంచ ఛాంపియన్లను తయారు చేయాలంటే సరైన ప్రణాళిక ఉండాలి. కోచ్ లేకుండా ఇది సాధ్యపడదు" -దీపికా పల్లికల్, స్క్వాష్ క్రీడాకారిణి

ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో స్క్వాష్​ను ఎవరూ ఎంచుకోరని చెప్పింది దీపిక.

"నేను(దీపిక), జోష్నా చిన్నప్ప కాకుండా అగ్రస్థాయి స్క్వాష్ క్రీడాకారులు కనిపించడం లేదు. ఇలాగే కొనసాగితే 5,6 ఏళ్ల తర్వాత ఎవరూ ఈ ఆట వైపు మొగ్గుచూపరు. ఆటగాళ్లకు మార్గనిర్దేశం చేయడానికి కోచ్​లు అవసరం. వాళ్లు లేకుండా టోర్నమెంట్లలో పాల్గొని ఉపయోగం ఏంటి?" -దీపికా పల్లికల్, స్క్వాష్ క్రీడాకారిణి

ఫుల్ టైమ్​ కోచ్ కాకుండా ఈవెంట్లు ఉన్నప్పుడు తాత్కాలిక పద్ధతిలో శిక్షకుడిని నియమించాలని ఈ ఏడాది ప్రారంభంలో నిర్ణయించింది ఫెడరేషన్. అయితే ఈ విధానం వల్ల ఉపయోగం ఉండదని చెప్పింది పల్లికల్. ఆ కొద్ది కాలంలో ఆటగాళ్ల ఆటలో ఎలాంటి మార్పు ఉండదని తెలిపింది.

ఇదీ చదవండి: 'అలా అయితే నేను క్రికెట్ ఆడేవాడినే కాదు'

Last Updated : Sep 30, 2019, 1:14 PM IST

ABOUT THE AUTHOR

...view details