తెలంగాణ

telangana

డిస్కస్‌ త్రోయర్‌ సందీప్‌ కుమారిపై నిషేధం

By

Published : May 3, 2020, 7:51 AM IST

భారత డిస్కస్​త్రో అథ్లెట్​ సందీప్​ కుమారిపై నాలుగేళ్లు నిషేధం విధించింది ప్రపంచ డోపింగ్‌ నిరోధక సంస్థ (వాడా). 2018లో గువాహటిలో జరిగిన అంతర్రాష్ట్ర అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో ఆమె నిషేధిత ఉత్ప్రేరకం వాడినట్లు స్పష్టమైంది.

Discus thrower Sandeep Kumari gets 4 year ban for dope flunk
డిస్కస్‌ త్రోయర్‌ సందీప్‌ కుమారిపై నిషేధం

భారత డిస్కస్‌త్రో అథ్లెట్‌ సందీప్‌ కుమారిపై ప్రపంచ డోపింగ్‌ నిరోధక సంస్థ (వాడా) నాలుగేళ్ల నిషేధం విధించింది. 2018 జూన్‌లో గువాహటిలో జరిగిన అంతర్రాష్ట్ర అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ సందర్భంగా స్వీకరించిన ఆమె శాంపిల్‌లో నిషేధిత ఉత్ప్రేరకం ఉన్నట్లు తేలింది. ఆ ఛాంపియన్‌షిప్‌లో తను స్వర్ణం గెలిచింది.

మొదట జాతీయ డోపింగ్‌ పరీక్షల ల్యాబ్‌లో నిర్వహించిన పరీక్షలో ఆమె ఫలితం నెగిటివ్‌గా వచ్చింది. కానీ వాడా చేసిన పరీక్షలో తను నిషేధిత ఉత్ప్రేరకం వాడినట్లు స్పష్టమైంది. ఆమె దగ్గర నుంచి శాంపిల్‌ తీసుకున్న రోజు నుంచే ఈ నిషేధం వర్తించనుంది.

భారత డిస్కస్​త్రో అథ్లెట్​ సందీప్​ కుమారి

ABOUT THE AUTHOR

...view details