గురువారం జరిగిన ఒలింపిక్స్ అర్హత పోటీల్లో భారత రెజ్లర్లు కడియన్(97 కిలో), సుమిత్ మాలిక్(125 కిలో) క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించారు. మరో రెజ్లర్ ధంకర్(74 కిలో) ఓటమి పాలయ్యాడు.
ఒలింపిక్స్ అర్హత పోటీలు: క్వార్టర్స్‌లో కడియన్, సుమిత్
ఒలింపిక్స్ అర్హత పోటీల్లో భారత రెజ్లర్లు కదియన్, సుమిత్ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నారు. గురువారం జరిగిన ఈ పోటీల్లో వీరు గెలవగా, ధంకర్ ఇంటిముఖం పట్టాడు.
కదియన్, సుమిత్
ఎవాన్ యమడోర్ రమోస్(ప్యూర్టో రికో)ను 5-2తేడాతో కడియన్ ఓడించగా, అయాల్ లాజెర్వ్(కిర్గిస్థాన్)ను 3-2తేడాతో సుమిత్ మట్టికరిపించాడు. అయితే ధంకర్ మాత్రం మిహేల్ సావా(మాల్దోవా) చేతిలో 6-9తేడాతో ఓడిపోయాడు.
ఇదీ చూడండి: ఆసియా రెజ్లింగ్: వినేశ్, దివ్య, అన్షులకు స్వర్ణాలు