టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన తర్వాత ఆటకు దూరంగా ఉన్న భారత స్టార్ షట్లర్ పి. వి. సింధు మళ్లీ రాకెట్ పట్టనుంది. మంగళవారం ఆరంభం కానున్న డెన్మార్క్ ఓపెన్ ప్రపంచ ఓపెన్ టోర్నీలో మహిళల సింగ్‌ల్స్‌లో ఆమె టైటిలే లక్ష్యంగా బరిలో దిగుతోంది. తొలి రౌండ్లో యిగిట్ (టర్కీ)తో నాలుగో సీడ్ సింధు తలపడనుంది. ఈ రౌండ్ దాటితే రెండో రౌండ్లో థాయ్‌లాండ్ క్రీడాకారిణి బుసానన్ ఆమెకు ఎదురుపడే అవకాశాలున్నాయి.
నేటి నుంచే డెన్మార్క్ ఓపెన్.. బరిలో సింధు - పీవీ సింధు న్యూస్
నేడు ప్రారంభం కానున్న డెన్మార్క్ ఓపెన్ ప్రపంచ ఓపెన్ టోర్నీలో స్టార్ షట్లర్ పి. వి. సింధు బరిలోకి దిగుతోంది. తొలి రౌండ్లో యిగిట్ (టర్కీ)తో నాలుగో సీడ్ సింధు మంగళవారం మధ్యాహ్నం తలపడనుంది.
మరో స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ కూడా ఈ టోర్నీలో ఆడుతోంది. గాయం నుంచి కోలుకున్న ఆమె సత్తా చాటాలనే పట్టుదలతో ఉంది. అయా ఒహోరీ (జపాన్)తో ఆమె తొలి రౌండ్ మ్యాచ్ ఆడనుంది. పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్ పోటీలో ఉన్నాడు. ఈ ఆదివారం ముగిసిన డచ్ ఓపెన్లో రన్నరప్‌గా నిలిచిన లక్ష్య ఇదే ఫామ్‌ను కొనసాగించాలనే పట్టుదలతో ఉన్నాడు. తొలి రౌండ్లో అతడు... సహచరుడు సౌరభ్ వర్మతో తలపడనున్నాడు. స్టార్ షెట్లర్ కిదాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్ కూడా బరిలో ఉన్నారు. తొలి రౌండ్లో శ్రీకాంత్‌తోనే సాయిప్రణీత్ పోటీపడనున్నాడు. థామస్‌కప్‌లో రాణించి సమీర్‌వర్మ తొలి రౌండ్లో విదిత్‌శరణ్‌ను ఢీకొనబోతుండగా.. కామన్వెల్త్ మాజీ ఛాంపియన్ పారపల్లి కశ్యప్.. చోతిన్ చెన్ (చెనీస్ తైపీ)తో తలపడనున్నాడు. డబుల్స్‌లో సిక్కి రెడ్డి-అశ్విని పన్నప్ప, మేఘన జక్కంపుడి-పూర్వీషా రామ్... మిక్స్‌డ్ డబుల్స్‌లో "సాత్విక్-అశ్విని బరిలో ఉన్నారు.
ఇదీ చదవండి:'బీసీసీఐ-పీసీబీ మధ్య స్నేహబంధం ఏర్పడాలి'