భారత ప్రముఖ రెజ్లర్ సుశీల్ కుమార్‌కు దిల్లీ కోర్టులో చుక్కెదురైంది. హత్య కేసులో ముందస్తు బెయిల్ కోసం వేసిన పిటిషన్‌ను తిరస్కరించింది న్యాయస్థానం.
సుశీల్ బెయిల్ పిటిషన్ తిరస్కరణ - బెయిల్ పిటిషన్
భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్‌కు దిల్లీ కోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది.
మే 4న దిల్లీలోని ఛత్రశాల్ స్టేడియం పరిధిలో జరిగిన గొడవలో సాగర్ రానా అనే వ్యక్తి మృతి చెందాడు. ఈ హత్య కేసులో సుశీల్‌తో పాటు మరో ఇద్దరు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో భాగంగా సుశీల్‌పై హత్య, అపహరణ, నేరపూరిత కుట్ర, ఇతర సెక్షన్ల కింద కేసు నమోదైంది. హత్య జరిగిన నాటి నుంచి పరారీలో ఉన్న సుశీల్.. మే 17న ముందస్తు బెయిల్ పిటిషన్ కోరుతూ రోహిణి కోర్టును ఆశ్రయించాడు. దర్యాప్తునకు పూర్తి స్థాయిలో సహకరిస్తానని వ్యాజ్యంలో పేర్కొన్నాడు. అయినా కోర్టు అతడి అభ్యర్థనకు అంగీకరించలేదు.