కరోనా వ్యాప్తి తీవ్రమవుతున్న నేపథ్యంలో టోక్యో ఒలింపిక్స్ వాయిదా పడ్డాయి. వచ్చే ఏడాది జరపాలని నిర్ణయించారు. అయితే దీని వల్ల అదనపు ఖర్చులు భారీగా ఉంటాయని నిర్వహకులు చెబుతున్నారు. అందుకోసం ఓ కార్యదళాన్ని(టాస్క్ఫోర్స్) ఏర్పాటు చేశారు. గురువారం తొలి సమావేశం జరిపారు. ఇందులో మాట్లాడిన టోక్యో ఒలింపిక్స్ సీఈఓ తోషిరో మ్యూటో పలు విషయాలు చెప్పారు.
ఈ వాయిదా తరుణంలో తమకు ఎదురయ్యే సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వెళ్తామని అన్నారు. అదనపు ఖర్చులు తాము అనుకున్న దానికంటే ఎక్కువేనని, దీనిపై మరింత కృషి చేయాల్సి ఉందని చెప్పారు. అయితే వాయిదా వల్ల ఎంత ఖర్చులు పెరుగుతాయో ఇప్పుడే చెప్పాలేనని స్పష్టం చేశారు.
2.7 బిలియన్ డాలర్లు అదనం!