టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ వేట మొదలైంది. ఆర్చరీ మహిళల వ్యక్తిగత ర్యాంకింగ్ రౌండ్లో ఆకట్టుకునే ప్రదర్శన చేసింది వరల్డ్ నెంబర్ వన్ దీపికా కుమారి. మొత్తం 64 మందిలో 9వ స్థానంలో నిలిచింది. 72 బాణాలు సంధించి, 663 స్కోరు సాధించింది. ఈ విషయాన్ని భారత క్రీడా సమాఖ్య(SAI) ట్వీట్ చేసింది.
ఒలింపిక్ రికార్డు
క్వాలిఫికేషన్ రౌండ్లో అద్భుత ప్రదర్శన చేసిన దక్షిణాకొరియా ఆర్చర్ అన్ సన్.. అగ్రస్థానంలో నిలిచింది. మొత్తంగా 680 పాయింట్లు దక్కించుకుని, ఒలింపిక్ రికార్డు సృష్టించింది.
అంతకుముందు ర్యాంకింగ్ రౌండ్లో 673 స్కోరుతో రికార్డు ఉండగా, ప్రపంచ రికార్డు కాంగ్ చే వాంగ్(692)పేరిట ఉంది.
దీపిక.. భూటాన్ ఆర్చర్‌తో..
టేబుల్ టాప్‌లో ఉన్న ఆర్చర్లు.. దిగువ స్థానాల్లో నిలిచిన వారితో తలపడాల్సి ఉంటుంది. అంటే తొలి స్థానంలో నిలిచిన అన్ సన్, ర్యాంకింగ్ రౌండ్లో చివరి స్థానంలో(64) ఉన్న ఆర్చర్‌తో తదుపరి రౌండ్ ఆడాలి.
దీపికా కుమారి(9).. భూటాన్‌కు చెందిన కర్మాతో తొలి రౌండ్ ఆడనుంది. కర్మా ర్యాంకింగ్ రౌండ్లో 56వ స్థానంలో నిలిచింది.
దీపికకు.. అన్ సన్ క్వార్టర్ ఫైనల్లో ఎదురుపడాల్సి రావచ్చు.