టోక్యో ఒలింపిక్స్‌కు ముందు జరగనున్న చివరి ర్యాంకింగ్స్ టోర్నీకి భారత రెజ్లర్ దీపక్ పూనియా దూరమయ్యాడు. ఎడమ చేతి గాయం కారణంగా పొలాండ్ వేదికగా జరిగే రెజ్లింగ్ పోటీల నుంచి వైదొలిగాడు. 2019 ప్రపంచ ఛాంపియన్ అయిన పూనియా.. మరో రెండు రోజుల్లో వార్సాకు బయలుదేరాల్సి ఉంది.
"పొలాండ్ టోర్నీలో ఆడే విషయంపై దీపక్కే అవకాశమిచ్చాం. ఒలింపిక్స్‌కు ముందు అతడు రిస్క్ తీసుకోవాలనుకోవడం లేదు. మేము కూడా అతనిపై ఒత్తిడి చేయాలనుకోవట్లేదు."
-వినోద్ తోమర్, భారత రెజ్లింగ్ సమాఖ్య సహాయక కార్యదర్శి.
దీపక్ పూనియా దూరం కావడం వల్ల భారత్ నుంచి మరో ముగ్గురు మాత్రమే ఈ పోటీల్లో ఉన్నారు. రవి దహియా(57 కేజీ) ఈ టోర్నీలో 61 కేజీల విభాగంలో పాల్గొననున్నాడు. వినేష్ ఫొగట్(53 కేజీ), అన్షు మాలిక్(57 కేజీ) మరో ఇద్దరు రెజ్లర్లు ఈ పోటీల్లో ఆడనున్నారు.
మరో రెజ్లర్ భజరంగ్ పూనియా కూడా ఈ పోటీలకు దూరమయ్యాడు. టోక్యో ఒలింపిక్స్‌కు ముందు శిక్షణ కోసం అతడు రష్యాకు వెళ్లాడు. డోపింగ్ పరీక్షలో దొరికిపోయిన సుమిత్ మలిక్‌పై నిషేధం పడింది. గాయం కారణంగా సీమా బిస్లా, సోనమ్ మలిక్ కూడా పొలాండ్‌కు వెళ్లలేదు.
ఇదీ చదవండి:'సుశీల్ ఘటనతో డబ్ల్యూఎఫ్ఐ ప్రతిష్ఠ దిగజారింది'