థాయ్‌లాండ్ ఓపెన్‌లో ఏడుగురు భారత బాక్సర్లు క్వార్టర్స్‌కు చేరారు. సోమవారం జరిగిన పోటీల్లో ఆసియన్ ఛాంపియన్‌షిప్‌లో రజతం దక్కించుకున్న దీపక్ సింగ్(49కేజీ), మాజీ ప్రపంచ ఛాంపియన్ నిఖాత్ జరీన్(51కేజీ) సత్తాచాటారు.
వీరితో పాటు మనీషా మౌన్(57 కేజీ), ఆశిష్ కుమార్(75 కేజీ), మంజూ రాణి(48 కేజీ), ఇండియా ఓపెన్ రజతం గ్రహీత బ్రిజేశ్ యాదవ్(81 కేజీ) క్వార్టర్స్ చేరారు.