దిగ్గజ అమెరికన్ బాస్కెట్‌బాల్ ప్లేయర్ కోబ్ బ్రాయంట్.. ఆదివారం లాస్ ఏంజిల్స్‌లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందాడు. ఇతడితో ప్రయాణిస్తున్న కూతురు గియానా, మరో ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. కోబ్ మరణం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానుల్ని శోకసంద్రంలో ముంచేసింది. వారితో పాటే పలువురు ప్రముఖులు సోషల్ మీడియాలో అతడికి సంతాపం తెలుపుతున్నారు.
బాస్కెట్‌బాల్ చరిత్రలో ఎన్నో రికార్డులు సృష్టించుకున్న బ్రాయంట్లో ఓ రచయిత కూడా ఉన్నాడు. 2015లో రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత.. గ్లెన్ కేన్-జాన్ విలియమ్స్‌లతో కలిసి ఓ లఘు చిత్రం కోసం 'డియర్ బాస్కెట్‌బాల్' అనే పద్యం రాశాడు కోబ్. 2018లో ఉత్తమ యానిమేటడ్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుందిది.