తెలంగాణ

telangana

ETV Bharat / sports

Danish Open: భారత్​కు పసిడి.. వేదాంత్ మాధవన్ ఘనత - వేదాంత్ మాధవన్

Danish Open: డానిష్ ఓపెన్​ స్విమ్మింగ్​ టోర్నమెంట్​లో బంగారు పతకంతో సత్తాచాటాడు వేదాంత్ మాధవన్. 800మీటర్ల ఫ్రీ స్టైల్ విభాగంలో ఛాంపియన్​గా నిలిచి ఈ టోర్నీలో రెండో పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.

Danish Open
vedaant madhavan

By

Published : Apr 18, 2022, 12:32 PM IST

Vedaant Madhavan Gold Medal: డానిష్​ ఓపెన్​లో అద్భుత ప్రదర్శన కొనసాగిస్తూ రెండో మెడల్​ను తన ఖాతాలో వేసుకున్నాడు నటుడు మాధవన్ కుమారుడు వేదాంత్ మాధవన్. కోపెన్​హాగన్​లో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల 800మీ.ల విభాగంలో పసిడి కైవసం చేసుకున్నాడు. 0.10సెకన్ల తేడాతో అలెగ్జాండర్​ ఎల్​ జోర్న్​ను (8:17.38) రెండో స్థానానికి పరిమితం చేసి.. 8:17.28 నిమిషాల్లోనే లక్ష్యం పూర్తి చేశాడు.

ఈ ప్రదర్శనతో బంగారు పతకం సాధించినా.. అంతర్జాతీయ ప్రమాణాలకు దూరంగానే ఉన్నాడు వేదాంత్. అమెరికాకు చెందిన రాబర్ట్​ ఫింకే టోక్యో ఒలింపిక్స్​లో గోల్డ్​ మెడల్​ను 7:41.87 టైమింగ్​తో కైవసం చేసుకున్నాడు. ఇక ఈవెంట్​లో ప్రపంచ రికార్డు 7:32.12 నిమిషాలు. అయితే ప్రస్తుత టోర్నీలో పాల్గొన్న మూడు ఈవెంట్లలోనూ వ్యక్తిగత అత్యుత్తమ టైమింగ్​ను అధిగమించి వేగంగా మెరుగవుతున్నట్లు చెప్పాడు వేదాంత్. శుక్రవారం జరిగిన ఫ్రీస్టైల్ ఈవెంట్​లో రజతం గెలిచాడు.

ఇదీ చూడండి:మాధవన్​ కుమారుడి ఘనత.. డానిష్​ ఓపెన్ స్విమ్మింగ్​​లో సిల్వర్

ABOUT THE AUTHOR

...view details