Commonwealth Games 2022: కామన్వెల్త్ క్రీడల్లో భాగంగా జావెలిన్ త్రోలో పాకిస్థాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ రికార్డు సృష్టించాడు. ఫైనల్లో ఏకంగా జావెలిన్‌ను 90.18 మీటర్ల దూరం విసిరి స్వర్ణం కొల్లగొట్టాడు. ఈ క్రమంలో జావెలిన్‌ను 90 మీటర్లకు పైగా విసిరిన రెండో ఆసియా అథ్లెట్‌గా గుర్తింపు పొందాడు. 2017లో చైనా అథ్లెట్ తైపీ 91.36 మీటర్ల త్రో ఇప్పటివరకు అత్యధికం. నదీమ్ ప్రదర్శనతో పాక్ 56 ఏళ్ల తర్వాత కామన్వెల్త్ గేమ్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో పతకం గెలవగా.. జావెలిన్ త్రోలో పాక్‌కు ఇదే తొలి స్వర్ణం కావడం విశేషం. ఈ ఫీట్‌తో నదీమ్.. భారత అథ్లెట్, ప్రపంచ నంబర్‌వన్ నీరజ్ చోప్రా టోక్యో ఒలింపిక్ త్రో(87.58 మీటర్ల)ను అధిగమించాడు. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ త్రో 88.13 మీటర్లను కూడా దాటేశాడు.
నీరజ్‌చోప్రా 'గోల్డ్‌మెడల్' రికార్డ్ బద్దలు.. ఎవరా అథ్లెట్? - pakisthan javellin athlet record
Commonwealth Games 2022 Neeraj chopra: కామన్వెల్త్ క్రీడల్లో భాగంగా జావెలిన్ త్రోలో ఓ అథ్లెట్ రికార్డు త్రో విసిరి అందర్నీ ఆకట్టుకున్నాడు. దీంతో భారత అథ్లెట్, ప్రపంచ నంబర్‌వన్ నీరజ్ చోప్రా కూడా షాక్ అయ్యాడు!
ఇటీవల ముగిసిన ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో నదీమ్ ఐదో స్థానంలో నిలువగా.. నీరజ్ చోప్రా 88.13 మీటర్ల దూరం విసిరి రజత పతకాన్ని గెలుచుకున్నాడు. అయితే, నీరజ్ చోప్రా కామన్‌వెల్త్ బరిలోకి దిగి ఉంటే కచ్చితంగా 90 మీటర్ల దూరం విసిరేవాడని అంతా భావించారు. చివరి నిమిషంలో అతడు గాయం కారణంగా దూరమయ్యాడు. నీరజ్ గైర్హాజరులో భారత తరఫున డి.పి. మను 82.28 త్రోతో ఐదో స్థానంలో నిలవగా, రోహిత్ యాదవ్ 82.22 మీటర్లు విసిరి ఆరో స్థానంలో నిలిచాడు. కామన్వెల్త్ గేమ్స్ జావెలిన్ త్రో గోల్డ్ కొట్టిన అర్షద్... దీన్ని ఇన్‌స్టాలో పోస్ట్ చేయగా, భారత స్టార్ ఆటగాడు నీరాజ్ చోప్రా స్పందించాడు. "అర్షద్ భాయ్ స్వర్ణం సాధించినందుకు అభినందనలు. 90 మీటర్ల త్రో దాటి కొత్త రికార్డు నమోదుచేశావు. భవిష్యత్‌లో మరిన్ని పోటీల్లో గెలవాలి. ఆల్ ది బెస్ట్" అని నీరాజ్ అభినందించాడు.
ఇదీ చూడండి: Commonwealth Games: అమ్మాయిలు.. సరిలేరు మీకెవ్వరూ