Cristiano Ronaldo: ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఇంట తీవ్ర విషాదం నెలకొంది. జార్జినా-రొనాల్డో జంటకు అప్పుడే జన్మించిన కవలల్లో ఒకరు మృతి చెందారు. ఈ విషయాన్ని రొనాల్డో సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. "అప్పుడే పుట్టిన మా బాబు చనిపోయిన విషయం మీతో పంచుకుంటున్నందుకు చాలా బాధగా ఉంది. ఏ తల్లిదండ్రులకైనా ఇది భరించలేని విషాదం. పాప బతికి ఉన్న విషయం ఒక్కటే ఇప్పుడు మాకు కొంత ఆశ, ఆనందాన్ని ఇవ్వగలదు. ఈ సమయంలో మా వెన్నంటి ఉన్న డాక్టర్లకు, నర్సులకు ధన్యవాదాలు. ఈ క్లిష్ట సమయంలో మా వ్యక్తిగత గోపత్యకు భంగం కల్పించవద్దని కోరుతున్నాం" అని రొనాల్డో ఉద్వేగపూరితమైన పోస్టును షేర్ చేశాడు.
Cristiano Ronaldo: ఫుట్‌బాల్ స్టార్ రొనాల్డో ఇంట విషాదం - cristiano ronaldo jr
Cristiano Ronaldo: పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఇంట తీవ్ర విషాదం నెలకొంది. జార్జినా-రొనాల్డో దంపతులకు అప్పుడే జన్మించిన కవలల్లో ఒకరు మృతిచెందారు.
cristiano ronaldo child
ఇప్పటికే జార్జినా- రొనాల్డో జంటకు నలుగురు పిల్లలున్నారు. మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నట్లు, కవలలను పుట్టే అవకాశం ఉందని గత అక్టోబర్‌లో ఈ జంట పేర్కొంది. ఈ ఫుట్‌బాల్ దిగ్గజం ఎంత బిజీగా ఉన్నప్పటకీ ఏ మాత్రం సమయం దొరికినా తన కుటుంబానికి కేటాయిస్తాడు. తన కుటుంబమే తనకు బలమని ఎప్పటికీ చెబుతుంటాడు. ఇటీవలే అతని జట్టు పోర్చుగల్ ఈ ఏడాది ఖతార్‌లో జరిగే ప్రపంచకప్‌కు అర్హత సాధించింది.
ఇదీ చూడండి:ఫోన్ నేలకేసి కొట్టి.. అభిమానికి క్షమాపణలు చెప్పిన రొనాల్డో
Last Updated : Apr 19, 2022, 6:46 AM IST