తెలంగాణ

telangana

ETV Bharat / sports

Cricket In Olympics 2028 : ఒలింపిక్స్​లో క్రికెట్​కు చోటు.. ఐఓసీ కీలక నిర్ణయం.. ఎప్పటి నుంచంటే? - Cricket In Olympics

Cricket In Olympics 2028
Cricket In Olympics 2028

By ETV Bharat Telugu Team

Published : Oct 13, 2023, 3:52 PM IST

Updated : Oct 13, 2023, 4:51 PM IST

15:48 October 13

Cricket In Olympics 2028

Cricket In Olympics 2028 : క్రికెట్‌ అభిమానులు చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు చోటు కల్పిస్తూ అంతర్జాతీయ ఒలింపిక్స్‌ కమిటీ (ఐవోసీ) నిర్ణయం తీసుకుంది. 2028లో లాస్‌ ఏంజిలెస్‌లో జరగబోయే ఒలింపిక్స్‌లో టీ20 క్రికెట్‌ టోర్నీ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఐవోసీ ట్వీట్‌ చేసింది. వచ్చే ఒలింపిక్స్‌లో క్రికెట్‌తోపాటు బేస్‌బాల్‌, ఫ్లాగ్‌ ఫుట్‌బాల్‌, లాక్రోసీ, స్క్వాష్‌ క్రీడలకు కూడా చోటు కల్పించారు.

మరోవైపు టీ20 ఫార్మాట్‍లో ఒలింపిక్స్‌లో క్రికెట్‍ను నిర్వహించేందుకు ఆమోదించినట్టు ఐఓసీ ప్రెసిడెంట్ థామస్ బాచ్ పేర్కొన్నారు. ముంబయిలో జరుగుతున్న ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశం రెండో రోజు తర్వాత ఆయన ఈ విషయాన్ని తెలిపారు . ఒలింపిక్ క్రీడల్లో టీ20 క్రికెట్​ను చేర్చేందుకు లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ నిర్వాహకులు అంగీకరించినట్టు అందులో వెల్లడించారు. అయితే బ్యాలెట్ పద్ధతిలో జరిగే ఐఓసీ మెంబర్షిప్‍ ఓటింగ్‍లో క్రికెట్‍కు మద్దతుగా ఎక్కువ ఓట్లు రావాల్సి ఉంది. ఇది పూర్తయితే 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్ క్రీడల్లో క్రికెట్ ఉండడం పూర్తిగా ఖాయం అవుతుందని ఆయన అన్నారు. ఈ ఐఓసీ మెంబర్షిప్ ఓటింగ్ ప్రక్రియ సోమవారం (అక్టోబర్ 16) జరగనుంది.

128 ఏళ్ల తర్వాత ఇలా..
చివరగా 1900 ఒలింపిక్స్‌లో క్రికెట్ పోటీలు జరిగాయి. మళ్లీ ఇప్పుడు 128 ఏళ్ల తర్వాత ఒలింపిక్ క్రీడల్లో క్రికెట్ పోటీల నిర్వహణకు అడుగులు పడుతున్నాయి. ఒలింపిక్ క్రీడల్లో క్రికెట్ ఉండే.. భారత్‍కు సానుకూలంగా ఉంటుంది. అలాగే, క్రికెట్ మరిన్ని దేశాలకు కూడా విస్తరించే అవకాశం కూడా ఉంటుంది.

అయితే అప్పట్లో ఒలింపిక్స్‌లో క్రికెట్‍ను చేర్చాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి, భారత్ క్రికెట్ నియంత్రణ మండలి చాలా కాలం పాటు కృషి చేశాయి. ఇందుకోసమే 2024 టీ20 ప్రపంచకప్‍ను వెస్టిండీస్‍తో పాటు అమెరికాలోనూ ఐసీసీ నిర్వహిస్తోంది. క్రికెట్‍ను మరిన్ని దేశాల్లో పాపులర్ చేసేందుకు ఒలింపిక్స్ సరైన మార్గమని ఐసీసీ భావిస్తోంది. ఇప్పుడు ఈ వార్త తర్వాత ఒలంపిక్స్​లో క్రికెట్​ను చూసే అవకాశం దక్కుతుందని అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Last Updated : Oct 13, 2023, 4:51 PM IST

ABOUT THE AUTHOR

...view details