తెలంగాణ

telangana

ETV Bharat / sports

కరోనా దెబ్బకు క్రీడా నిర్వాహకులకు మూడే దారులు! - corona news 2020

కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా క్రీడారంగం కుదేలైంది. ఈ వైరస్​ దెబ్బకు టోర్నీ నిర్వాహకులకు మూడే దారులు కనిపిస్తున్నాయి. ఆటలు వాయిదా వేయడం, రద్దు చేయడం, ఖాళీ స్టేడియాల్లో నిర్వహించడం వంటి ఛాన్స్​లు మాత్రమే ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత్​లో జరగబోయే కొన్ని టోర్నీలపై సందిగ్థత నెలకొంది.

COVID-19 stumps Different Sports: IPL start date pushed and postponements galore, closed door series in other sports
కరోనా దెబ్బకు క్రీడా నిర్వాహకులకు మూడే దారులు!

By

Published : Mar 14, 2020, 6:58 AM IST

Updated : Mar 14, 2020, 6:24 PM IST

ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్​(కొవిడ్​ 19) ప్రభావం భారత్​పైనా కనిపిస్తోంది. ఇప్పటికే కొన్ని దేశాల్లో క్రీడా టోర్నీలను పూర్తిగా రద్దు చేయగా.. మరికొన్ని దేశాల్లో ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్​లను నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ క్రమంలో భారత్​లో జరగాల్సిన కొన్ని క్రీడా టోర్నీలు రద్దయ్యాయి. మరికొన్ని వాయిదా పడ్డాయి.

క్రికెట్​..

  • కరోనా కారణంగా భారత్​-దక్షిణాఫ్రికా మధ్య జరగాల్సిన వన్డే సిరీస్​ రద్దయింది. ఇప్పటికే మార్చి 12న ధర్మశాల వేదికగా జరగాల్సిన మ్యాచ్​ వర్షార్పణం అయింది. మిగతా రెండు మ్యాచ్​లు(లఖ్​నవూ, కోలక్​తా) వాయిదా వేశారు. అయితే ఇవి ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై స్పష్టతనివ్వలేదు.
  • కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) ప్రభావం ఐపీఎల్‌కే కాదు, చెన్నై సూపర్‌ కింగ్స్‌ ప్రాక్టీస్‌పై కూడా పడింది. భారత్‌లో కరోనా విజృంభిస్తుండటం వల్ల సీఎస్‌కే జట్టు ప్రాక్టీస్‌ను రద్దు చేసుకుంది.
  • మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్​ 13వ సీజన్ టోర్నీ​ వాయిదా పడింది. ఏప్రిల్​ 15 నుంచి ఈ పోటీలు మొదలుకానున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.
  • ఆస్ట్రేలియా-న్యూజిలాండ్‌ మధ్య వన్డే సిరీస్​ ప్రేక్షకులు లేకుండా ఖాళీ స్టేడియాల్లోనే నిర్వహిస్తున్నారు.
  • పాకిస్థాన్​ సూపర్​లీగ్​ షెడ్యూల్​ కన్నా నాలుగు రోజులు ముందే ముగియనుంది. టోర్నీ నుంచి దాదాపు 10 మంది విదేశీ ఆటగాళ్లు వైదొలిగారు.
  • ముంబయి, పుణెలలో ఈనెల 22 వరకు జరగనున్న 'రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్' రద్దు చేశారు.
  • మార్చి 22 నుంచి ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మధ్య జరగాల్సిన మహిళల వన్డే, టీ20 సిరీస్ రద్దయింది.
  • ఇంగ్లాండ్‌-శ్రీలంక టెస్టు సిరీస్‌ను వాయిదా చేశారు. షెడ్యూల్‌ ప్రకారం శ్రీలంకలో ఇంగ్లిష్ జట్టు మార్చి 19న, మార్చి 27న రెండు టెస్టులు ఆడాల్సి ఉంది. కానీ, కరోనా విజృంభిస్తుండటం వల్ల శ్రీలంక సిరీస్‌ను వాయిదా వేస్తున్నట్లు ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డ్‌ తెలిపింది.

రేసింగ్​..

  • కోవిడ్‌-19 (కరోనా వైరస్‌) కారణంగా ఫార్ములా వన్‌ ఆస్ట్రేలియా గ్రాండ్‌ ప్రి రద్దైంది. ఈ నెల 15 నుంచి జరగాల్సిన F1 రేసింగ్‌ ఈవెంట్‌ను రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు శుక్రవారం వెల్లడించారు.
  • బహ్రెయిన్​ గ్రాండ్​ ప్రి మార్చి తర్వాతి వారానికి.. వియత్నాం గ్రాండ్​ ప్రి ఏప్రిల్​ 5కు వాయిదా పడ్డాయి.

వ్యాయామ క్రీడలు

  • మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్​ వేదికగా ఏప్రిల్​ 6-8 తేదీల్లో జరగబోయే ఫెడరేషన్ కప్ జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌ వాయిదా పడింది.

బ్యాడ్మింటన్

  • దిల్లీలో మార్చి 24 నుంచి 29 వరకు జరగనున్న ఇండియా ఓపెన్..​ ప్రేక్షకులు లేకుండానే నిర్వహించనున్నారు.

బాస్కెట్​బాల్​

  • బెంగళూరు వేదికగా మార్చి 18 నుంచి 22 వరకు నిర్వహించనున్న అంతర్జాతీయ బాస్కెట్​బాల్​ సమాఖ్య నిర్వహించే ఒలింపిక్ అర్హత టోర్నమెంట్ వాయిదా పడింది.

ఫుట్​బాల్

  • ఆల్​ ఛాంపియన్స్​ లీగ్​, ఐరోపా లీగ్​ మ్యాచ్​లు వాయిదా పడ్డాయి. ఇంగ్లాండ్​లో జరగాల్సిన అన్ని సాకర్​ టోర్నీలు ఏప్రిల్​ 4 వరకు రద్దు చేశారు.
  • ఏటీకె ఫుట్​బాల్​ క్లబ్​, చెన్నయిన్ ఫుట్​బాల్​ క్లబ్ మధ్య ఇండియన్ సూపర్ లీగ్ ఫైనల్ గోవాలో మార్చి 14న జరగనుంది. ప్రేక్షకులు లేకుండానే ఈ మ్యాచ్​ జరగనుంది.
  • ఈనెల 26న భువనేశ్వర్‌లో భారత్, ఖతార్ మధ్య జరగాల్సిన ఫిఫా ప్రపంచకప్ క్వాలిఫయర్ మ్యాచ్ వాయిదా పడింది.
  • జూన్​ 9న కోల్‌కతా వేదికగా భారత్, అఫ్గానిస్థాన్ మధ్య జరగనున్న ఫిఫా ప్రపంచకప్ క్వాలిఫయర్​ మ్యాచ్ వాయిదా పడింది.
  • ఏప్రిల్ 14 నుంచి 27 వరకు మిజోరాంలో జరగనున్న సంతోష్ ట్రోఫీ తుది రౌండ్ మ్యాచ్​లు వాయిదా పడ్డాయి.
  • ఐ-లీగ్​లోని 28 మ్యాచ్‌లు ఖాళీ స్టేడియాల్లో జరగనున్నాయి.

గోల్ఫ్

  • ఈ నెల 19 నుంచి 22 వరకు హర్యానా వేదికగా జరగనున్న ఇండియా ఓపెన్​ గోల్ఫ్​ టోర్నీ వాయిదా పడింది.

పారాస్పోర్ట్స్​

  • పారా క్రీడలకు సంబంధించిన అన్ని జాతీయ, రాష్ట్ర ఛాంపియన్‌షిప్‌ టోర్నీలు ఏప్రిల్ 15 వరకు వాయిదా పడ్డాయి.

షూటింగ్​

  • ఈనెల 15 నుంచి 25 వరకు జరగనున్న రైఫిల్​, పిస్టల్​, షార్ట్​గన్​ ప్రపంచకప్​ పోటీలను వాయిదా వేశారు.

టెన్నిస్​

  • భారత్​లో జరగనున్న దేశవాళీ టెన్నిస్​ టోర్నీ​లన్నీ రద్దు చేశారు.

చెస్​

  • ఆల్​ ఇండియా చెస్​ ఫెడరేషన్​ నిర్వహించే అన్ని చదరంగం పోటీలను మార్చి 31 వరకు వాయిదా వేశారు.

వీటితో పాటు టేబుల్‌ టెన్నిస్‌ మ్యాచ్​లకు బ్రేక్​ పడింది. ఏప్రిల్‌ తొలి వారం వరకు ఎటువంటి మ్యాచ్‌లు నిర్వహించమని అంతర్జాతీయ టేబుల్‌ టెన్నిస్‌ ఫెడరేషన్‌ తెలిపింది.

Last Updated : Mar 14, 2020, 6:24 PM IST

ABOUT THE AUTHOR

...view details