తెలంగాణ

telangana

ETV Bharat / sports

కామన్వెల్త్ యూత్ క్రీడలు రెండేళ్లు వాయిదా - టోక్యో ఒలింపిక్స్ తాజా వార్తలు

అంతర్జాతీయ క్రీడల క్యాలెండర్​లో మార్పులు జరిగిన నేపథ్యంలో కామన్వెల్త్ యూత్​ గేమ్స్​ను మరో రెండేళ్ల పాటు వాయిదా వేశారు. ఈ మేరకు అధికారిక ప్రకటనను విడుదల చేశారు.

కామన్వెల్త్ యూత్ క్రీడలు రెండేళ్లు వాయిదా
కామన్వెల్త్ యూత్ క్రీడలు

By

Published : May 1, 2020, 5:49 PM IST

కరోనా దెబ్బకు పలు క్రీడలతో పాటు టోక్యో ఒలింపిక్స్ వాయిదా పడ్డాయి. ఇప్పుడు ఈ పోటీల నిర్వహణ తేదీలు ముందుకు జరగడం వల్ల 2021లో జరగాల్సిన కామన్వెల్త్ యూత్​​ క్రీడలపై దెబ్బ పడింది. దీంతో వాటిని మరో రెండేళ్లు వాయిదా వేశారు. ఈ విషయాన్ని శుక్రవారం అధికారికంగా ప్రకటించారు.

"2021 కామన్వెల్త్ యూత్ క్రీడల​ నిర్వహణ తేదీల్ని మార్చాలని కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్​ ఎగ్జిక్యూటివ్​ బోర్డు నిర్ణయించింది. ఒలింపిక్స్, పారాలింపిక్స్ అదే ఏడాది జరగనున్నాయి. దీంతో ప్రత్నామ్యయాలపై దృష్టి పెట్టాం. కామన్వెల్త్ యూత్ గేమ్స్​ను 2023లో జరపాలని భావిస్తున్నాం​" -కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ ప్రకటన

షెడ్యూల్​ ప్రకారం ఏడో కామన్వెల్త్ యూత్​​ క్రీడలు.. ట్రినిడాడ్ అండ్ టొబాగో వేదికగా 2021 ఆగస్టు 1-7 మధ్య జరగాల్సి ఉంది. కానీ ఇప్పుడు వాటిని వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details