ఒలింపిక్స్‌ను చెప్పిన తేదీల్లో జరిపితే కరోనాను అధిగమించినట్లు ఓ బలమైన సందేశం ఇచ్చినట్లవుతుందని ఐఓఏ అధ్యక్షుడు నరీందర్ బత్రా అన్నారు. కొవిడ్ వల్ల ఇప్పటికే ఏడాది వాయిదా పడ్డ ఈ మెగా క్రీడలు.. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది జులై 23నుంచి జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మెగా ఈవెంట్‌ను రద్దు చేయాలంటూ 3.5 లక్షల సంతకాలతో ఓ ఆన్లైన్ పిటిషన్‌ను టోక్యో ప్రభుత్వానికి ఒలింపిక్స్ వ్యతిరేక ఆందోళనకారులు శుక్రవారం సమర్పించారు. ఈ నేపథ్యంలోనే బత్రా ఈ వ్యాఖ్యలు చేశారు.
"జీవితం ముందుకు సాగిపోవాలి. ఒలింపిక్స్ నిర్వహిస్తే కొవిడ్‌ను జయించినట్లు ఓ బలమైన సందేశాన్ని ప్రజలకు ఇచ్చినట్లవుతుంది. ఆటలపై వ్యతిరేకత ఎప్పుడూ ఉంటుంది. కానీ ఈ మెగాక్రీడల నిర్వహణ గురించి నిర్వాహకుల కమిటీ, ఐఓసీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కరోనా పట్లు భారత అథ్లెట్లు తగిన జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నారు. ఒలింపిక్స్‌లో తమ వంతుగా ఉత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు సన్నద్ధమవుతున్నారు"