తెలంగాణ

telangana

ETV Bharat / sports

చదరంగంలో భూమి, అంతరిక్షం మధ్య పోటీ - Sergey Karjakin latest news

చదరంగంలో భూమికి, అంతరిక్షానికి మధ్య పోటీ జరగనుంది. ఇందులో భూమి తరపున బ్లిట్జ్​ ప్రపంచ ఛాంపియన్​ సెర్గీ కర్జాకిన్​ ప్రాతినిధ్యం వహించనున్నాడు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి వ్యోమగాములు అనటోలీ ఇవానిషిన్​, ఇవాన్​ వాగ్నర్​ జట్టుగా ఆడనున్నారు. అయితే సెర్గీ కర్జాకిన్​ మాస్కోలోని వ్యోమగాముల స్మారక మ్యూజియంలో కూర్చుని ఆడనుండగా.. భూమి నుంచి 408 కి.మీ.ల ఎత్తు నుంచి అంతరిక్ష యాత్రికులు పావులు కదపనున్నారు.

Competition between Earth and space in chess
చదరంగంలో భూమి, అంతరిక్షం మధ్య పోటీ

By

Published : Jun 7, 2020, 1:01 PM IST

కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా స్తంభించిన క్రీడారంగం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఈ నేపథ్యంలో జరగనున్న ఓ చదరంగ పోటీ ఆసక్తి రేపుతోంది. ఎందుకంటే అది భూమి, అంతరిక్షం మధ్య పోరు మరి! మంగళవారం ఈ గేమ్‌ను నిర్వహించనున్నారు. భూమి తరపున మాజీ ర్యాపిడ్‌, బ్లిట్జ్‌ ప్రపంచ ఛాంపియన్‌ సెర్గీ కర్జాకిన్‌ ప్రాతినిథ్యం వహించబోతున్నాడు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని వ్యోమగాములు అనటోలీ ఇవానిషిన్‌, ఇవాన్‌ వాగ్నర్‌ జట్టుగా కలిసి ఈ రష్యా గ్రాండ్‌మాస్టర్‌తో తలపడబోతున్నారు. మాస్కోలోని వ్యోమగాముల స్మారక మ్యూజియంలో కూర్చుని సెర్గీ కర్జాకిన్‌ ఆడితే.. భూమికి 408 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న అంతరిక్ష కేంద్రం నుంచి ఆ వ్యోమగాములు పావులు కదపనున్నారు.

50 ఏళ్ల కిత్రమే:

భూమి, అంతరిక్షం మధ్య చదరంగం పోటీ పెట్టాలనే ఆలోచన 50 ఏళ్ల క్రితమే పుట్టింది. 1970, జూన్‌ 9న తొలిసారి ఈ తరహా చెస్‌ గేమ్‌ను నిర్వహించారు. అప్పటి సోవియట్‌ అంతరిక్ష నౌక సోయుజ్‌-9 నుంచి వ్యోమగాములు ఆండ్రియన్‌ నికోలెవ్‌, ఇవనోవిచ్‌.. భూమిపై ఉన్న నికోలై, విక్టర్‌తో తలపడ్డారు. దాదాపు ఆరు గంటల పాటు సాగిన ఈ గేమ్‌ను రేడియో ద్వారా అనుసంధానించారు. ఆ పోరు డ్రాగా ముగిసింది. చివరగా 2008-09లో నాసా, యుఎస్‌ చెస్‌ సమాఖ్య కలిసి ఈ తరహా పోటీ నిర్వహించారు.

ఇదీ చూడండి...'లాక్​డౌన్ సమయం​ టీమ్​ఇండియా బౌలర్లకు సదవకాశం'

ABOUT THE AUTHOR

...view details