Commonwealth Championship 2021: కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత లిఫ్టర్ పూర్ణిమ పాండే రికార్డుల మోత మోగించింది. గురువారం మహిళల +87 కిలోల విభాగంలో స్వర్ణం గెలిచిన ఆమె.. వచ్చే ఏడాది జరగనున్న కామన్వెల్త్ గేమ్స్‌కు నేరుగా క్వాలిఫై అయింది. పూర్ణిమ 229 కిలోలు (102కేజీ+127కేజీ) ఎత్తింది. స్నాచ్‌లో రెండు, క్లీన్ అండ్ జెర్క్‌లో మూడు, మొత్తంలో మూడు రికార్డులు సృష్టించింది. ఈ క్రమంలో ఎనిమిది జాతీయ రికార్డులు నెలకొల్పింది.
మరో ఇద్దరు..
- 87 కేజీ విభాగంలో అనురాధ కాంస్యం సాధించింది. 195 కేజీలు(90కేజీ+105 కేజీ) ఎత్తింది.
- పురుషుల 109 కేజీ ఈవెంట్లో లవ్‌ప్రీత్ సింగ్ రజతం సొంతం చేసుకున్నాడు. 348 కిలోలు(161కేజీ+187కేజీ) ఎత్తాడు.
కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లోని వివిధ కేటగిరీల్లో స్వర్ణం గెలిచిన వారు 2022 కామన్వెల్త్ క్రీడలకు నేరుగా అర్హత సాధిస్తారు. మిగతా వారు తమ ర్యాంకింగ్స్‌ను బట్టి క్వాలిఫై అవుతారు.