Commonwealth games India medals: కామన్వెల్త్ క్రీడల్లో భారత్ ఖాతాలో మరో నాలుగు పతకాలు చేరాయి. అయితే అవన్నీ రజత పతకాలే కావడం విశేషం. ఎనిమిదో రోజు ముగిసేసరికి 9 స్వర్ణాలు, 10 రజతాలు, 9 కాంస్యలతో మొత్తం 28 పతకాలు సాధించి ఐదో ప్లేస్‌లో భారత్ ఉంది. తాజాగా మహిళల 10 వేల మీటర్ల రేస్ వాక్‌లో భారత క్రీడాకారిణి ప్రియాంక గోస్వామి అద్భుత ప్రదర్శన చేసి రజత పతకాన్ని కైవసం చేసుకుంది. ప్రియాంక 43:38.82లో రేసును పూర్తి చేసింది. పురుషుల 300మీటర్ల స్టీపుల్‌చేజ్ ఫైనల్‌లో అవినాష్ సాబ్లే రజతం సాధించాడు. 8:11.20లో రేసు పూర్తిచేసి భారత్ తరఫున అత్యుత్తమ ప్రదర్శన నమోదుచేశాడు. ఇక మెన్స్ ట్రిపుల్ జంప్‌లో సెల్వ ప్రభు 16.15 మీట్లరు ఎత్తు ఎగిరి సిల్వర్ మెడల్‌ను దక్కించుకున్నాడు. మరోవైపు లాన్ బౌల్స్‌లో మెన్స్ ఫోర్ టీమ్ కూడా రజత పతకాన్ని అందుకుంది. దీంతో భారత్ పతకాల సంఖ్య 28కు చేరింది.
CWG 2022: అదరగొడుతున్న భారత అథ్లెట్లు.. భారత్ ఖాతాలో ఎన్ని పతకాలంటే? - కామన్వెల్త్ క్రీడలు 2022 ప్రియాంక గోస్వామి
Commonwealth games India medals: కామన్వెల్త్ క్రీడల్లో భాగంగా భారత్ ఖాతాలో మరో నాలుగు పతకాలు చేరాయి. అయితే అవన్నీ సిల్వర్ మెడల్స్. ఎవరెవరు ఏ క్రీడల్లో సాధించారంటే?
మరోవైపు భారత బాక్సర్లు అమిత్ పంఘల్ (పురుషుల ఫ్లై వెయిట్), నీతూ ఘంగాస్ (మహిళల విభాగం) ఫైనల్ చేరారు. రెజ్లింగ్‌లో మహిళల 76 కేజీల క్వార్టర్ ఫైనల్‌లో పూజా సిహాగ్ న్యూజిలాండ్ ప్లేయర్ మిచెల్ మాంటేగ్‌ను ఓడించి సెమీఫైనల్‌లోకి ప్రవేశించింది. పురుషుల 74 కేజీల క్వార్టర్ ఫైనల్లో నవీన్ సింగపూర్‌కు చెందిన హాంగ్ యోవ్ లూను ఓడించి సెమీ ఫైనల్‌లోకి ప్రవేశించాడు. ఇక మహిళ క్రికెట్ టీమ్‌కూడా ఇంగ్లాండ్‌పై విజయం సాధించి ఫైనల్‌కు అర్హత సాధించింది.
ఇదీ చూడండి: కామన్వెల్త్ క్రికెట్ ఫైనల్లో భారత్ మహిళా జట్టు.. పతకం ఖాయం