టోక్యో ఒలింపిక్స్ జావెలిన్ త్రో విభాగంలో స్వర్ణ పతకం సాధించి అందరి దృష్టిని తనవైపు తిప్పుకొన్నాడు నీరజ్ చోప్డా(Neeraj Chopra). తాజాగా 2021 సీజన్‌కు ముగింపు పలికేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ చేశాడు.
Neeraj Chopra: 'ఈ ఏడాదికి ముగింపు పలుకుతున్నా' - జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్డా
టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన నీరజ్ చోప్డా(Neeraj Chopra).. 2021 సీజన్‌కు ముగింపు పలికేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ చేశాడు.
"టోక్యో నుంచి భారత్‌కు వచ్చాక మీ ప్రేమ, ఆప్యాయతలను పంచినందుకు అందరికీ ధన్యవాదాలు. దేశవ్యాప్తంగా ఇంత ప్రేమ పొందడం చాలా సంతోషంగా ఉంది. అది మాటల్లో చెప్పలేను. 2021 సీజన్‌కు ముగింపు పలుకుతున్నా. ప్రయాణ షెడ్యూల్‌తో పాటు అనారోగ్యం కారణంగా టోక్యో నుంచి వచ్చాక శిక్షణను తిరిగి ప్రారంభించలేకపోయా. ఈ ఏడాదికి ఇలా ముగింపు పలికి మళ్లీ రీఛార్జ్ అవ్వాలనుకుంటున్నా. 2022లో వరల్డ్ ఛాంపియన్‌షిప్స్, ఆసియా గేమ్స్, కామన్‌వెల్త్ గేమ్స్‌లో మరింత బలంగా మీ ముందుకు వస్తా. కొన్ని వారాలుగా భారత అథ్లెట్ల నుంచి నాకు మద్దతు లభించింది. జై హింద్" అని తెలిపాడు.
ఇదీ చూడండి:Tokyo Paralympics: సెమీస్‌కు దూసుకెళ్లిన భవినా బెన్