తెలంగాణ

telangana

ETV Bharat / sports

చిరాగ్‌, సాత్విక్‌ జోడీకి ఖేల్‌రత్న- షమీకి అర్జునా అవార్డు- ప్రకటించిన క్రీడా శాఖ - షమీ అర్జునా అవార్డు

Chirag Shetty Satwiksairaj Rankireddy : స్టార్ షట్లర్లు చిరాగ్‌ షెట్టి- సాత్విక్‌ సాయిరాజ్‌ జోడికి కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ మేజర్ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న అవార్డు ప్రకటించింది.

Chirag Shetty And Satwiksairaj Rankireddy
Chirag Shetty And Satwiksairaj Rankireddy

By ETV Bharat Telugu Team

Published : Dec 20, 2023, 4:33 PM IST

Updated : Dec 20, 2023, 9:09 PM IST

Chirag Shetty Satwiksairaj Rankireddy :స్టార్ షట్లర్లు చిరాగ్‌ షెట్టి- సాత్విక్‌ సాయిరాజ్‌ భారత అత్యున్నత పురస్కారానికి ఎంపికయ్యారు. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ బుధవారం ఈ జోడికి 'మేజర్ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న' అవార్డు ప్రకటించింది. అలాగే టీమ్ఇండియా స్టార్​ పేసర్​ మహ్మద్ షమీకి 'అర్జునా అవార్డు' లభించింది. షమీతోపాటు మరో 25 మంది అథ్లెట్​లు అర్జునా అవార్డుకు ఎంపికయ్యారు. వీరందరు 2024 జనవరి 9న రాష్ట్రపతి భవన్​లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు. ఇక భారత్​లో 'ఖేల్‌రత్న', 'అర్జున అవార్డు' అత్యున్నత క్రీడా పురస్కారాలుగా ఉన్న విషయం తెలిసిందే.

అర్జునా అవార్డు 2023కు ఎంపికైన అథ్లెట్లు :

  • క్రిషన్ బహదూర్- హాకీ
  • సుశీల చాను- హాకీ
  • ఓజస్ ప్రవీణ్- ఆర్చరీ
  • అధితి గోపిచంద్- ఆర్చరీ
  • శ్రీ శంకర్- అథ్లెటిక్స్
  • పారుల్ చౌదరి- అథ్లెటిక్స్
  • మహ్మద్ హుసాముద్దీన్- బాక్సింగ్
  • వైశాలీ- చెస్
  • అనుశ్ అగర్వాల్- ఈక్వెస్ట్రిన్
  • దివ్యకృతి సింగ్- ఈక్వెస్ట్రిన్ డ్రెస్సెజ్
  • దీక్ష దాగర్- గోల్ఫ్
  • పవన్ కుమార్- కబడ్డీ
  • రితూ నేగి- కబడ్డీ
  • నస్రీన్- ఖో ఖో
  • పింకి- లాన్ బౌల్స్
  • ఐశ్వర్య ప్రతాప్ సింగ్- షూటింగ్
  • ఈషా సింగ్- షూటింగ్
  • హరిందర్ పాల్ సింగ్- స్క్వాష్
  • ఐతికా ముఖర్జీ- టేబుల్ టెన్నిస్
  • సునీల్ కుమార్- రెజ్లింగ్
  • ఆంటిమ్- రెజ్లింగ్
  • రోషిబినా దేవి- వూషూ
  • శీతల్ దేవి- పారా ఆర్చరీ
  • అజయ్ కుమార్ రెడ్డి- బ్లైండ్ క్రికెట్
  • ప్రాచి యాదవ్- పారా కానోయింగ్

భారత్ చరిత్రలో తొలిసారి :సాత్విక్- చిరాగ్ జోడీ ఆక్టోబర్​లో ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్​లో నెం. 1 స్థానాన్ని దక్కించుకుంది. ఇలా పురుషుల డబుల్స్​లో అగ్రస్థానాన్ని దక్కించుకున్న తొలి జోడీగా సాత్విక్- చిరాగ్ నిలిచారు. ఇక గతేడాది ఈ జోడీ థామస్ కప్​,ళ ఇంగ్లాండ్​లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్​లో గోల్డ్, వరల్డ్​ ఛాంపియన్​షిప్స్​లో కాంస్యం దక్కించుకుంది.

Savita Punia Fih Player Of The Year : భారత మహిళల హాకీ టీమ్ గోల్​కీపర్​ సవితా పునియా వరుసగా మూడోసారి ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ ప్లేయర్ ఆఫ్​ ది ఇయర్ అవార్డును దక్కించుకుంది. ఈ మేరకు కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్​ ఠాకూర్ ఆమెకు ట్విట్టర్​లో శుభాకాంక్షలు తెలిపారు.

BWF Ranking Mens Doubles 2023 : చరిత్ర సృష్టించిన 'గోల్డ్ బాయ్స్​'.. తొలి భారత జోడీగా సాత్విక్‌-చిరాగ్‌ రికార్డ్

షమీ కోసం బీసీసీఐ స్పెషల్ రిక్వెస్ట్- అర్జునా అవార్డు రేసులో స్టార్ పేసర్

Last Updated : Dec 20, 2023, 9:09 PM IST

ABOUT THE AUTHOR

...view details