ఇప్పటికే కరోనా ప్రభావంతో చాలా టోర్నీలు రద్దవగా, మరికొన్ని వాయిదా పడ్డాయి. అయితే వైరస్ వ్యాప్తి రోజురోజుకు పెరుగుతున్న కారణంగా, ఈ ఏడాది జరగాల్సిన అన్ని అంతర్జాతీయ పోటీల్ని రద్దు చేస్తున్నట్లు చైనా ప్రకటించింది. 2022 వింటర్ ఒలింపిక్స్ ట్రయల్స్‌కు మాత్రం ఇందులో మినహాయింపునిచ్చింది. ఈ నిర్ణయం వల్ల కనీసం ఆరు డబ్ల్యూటీఏ టెన్నిస్ ఈవెంట్లు, మరో నాలుగు ఏటీపీ టోర్నీలపై ప్రభావం పడింది.
చైనాలో ఈ ఏడాది అన్ని క్రీడా టోర్నీలు బంద్ - china latest news
చైనాలో ఈ ఏడాది జరగాల్సిన అన్ని అంతర్జాతీయ పోటీల్ని రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కేవలం 2022 వింటర్ ఒలింపిక్స్ ట్రయల్స్‌కు మినహాయింపు ఇచ్చారు.
ఫుట్‌బాల్ స్టేడియం
ఇప్పటికే ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా పలు క్రీడా పోటీలు నిర్వహణ సందేహంగా మారింది. వీటిలో ఒలింపిక్స్ వచ్చే ఏడాదికి వాయిదా పడగా, టీ20 ప్రపంచకప్ అనుమానంగా మారింది. ఐపీఎల్‌ను విదేశాల్లో జరపాలనే ఆలోచనలో ఉంది బీసీసీఐ.
Last Updated : Jul 9, 2020, 7:34 PM IST