Praggnanandhaa: మెల్ట్‌వాటర్ ఛాంపియన్స్ ఆన్‌లైన్ చెస్ టోర్నమెంట్లో భారత యువ సంచలనం ప్రజ్ఞానంద జోరు కొనసాగుతోంది. సెమీఫైనల్లో నెదర్లాండ్స్ గ్రాండ్‌మాస్టర్ అనీష్ గిరికి షాకిచ్చిన ఈ గ్రాండ్‌మాస్టర్.. ఫైనల్లో ప్రపంచ నం.2, చైనీస్ ఆటగాడు డింగ్ లిరెన్‌తో హోరాహోరీగా తలపడుతున్నాడు. బుధవారం జరిగిన ఫైనల్ తొలి అర్ధభాగంలో 2.5-1.5 తేడాతో కాస్త వెనుకంజలో ఉన్నాడు. తొలి గేమ్‌ను కోల్పోయినప్పటికీ రెండో గేమ్‌లో మళ్లీ పుంజుకుని అనుభవజ్ఞుడైన డింగ్ లిరెన్‌కు ఆత్మరక్షణలో పడేశాడు. ఆ తర్వాత మళ్లీ చైనీస్ ఆటగాడు పైచేయి సాధించాడు. దీంతో బుధవారం తొలి అర్ధభాగంలో జరిగిన నాలుగు మ్యాచ్‌లలో 2.5-1.5 తేడాతో ప్రజ్ఞానంద వెనుకంజలో ఉన్నాడు. గురువారం రెండో అర్ధభాగం జరగనుంది. మళ్లీ నాలుగు గేమ్‌లు ఆడాల్సి ఉంటుంది. రెండో అర్ధభాగంలో ప్రజ్ఞానంద జోరు కనబరిస్తే చరిత్ర సృష్టించి ఛాంపియన్‌గా అవతరిస్తాడు. లేదంటే రన్నరప్‌తో సరిపెట్టుకుంటాడు.
మెల్ట్‌వాటర్ ఛాంపియన్స్ చెస్ ఫైనల్లో ప్రజ్ఞానంద హోరాహోరీ - master Praggnanandhaa
Chessable masters: మెల్ట్‌వాటర్ ఛాంపియన్స్ ఆన్‌లైన్ చెస్ ఫైనల్లో చైనీస్ ఆటగాడు డింగ్ లిరెన్‌తో హోరాహోరీగా తలపడుతున్నాడు ప్రజ్ఞానంద. తొలి అర్ధభాగంలో జరిగిన 4 గేమ్‌లలో 2.5-1.5 తేడాతో కాస్త వెనుకంజలో. గురువారం రెండో అర్ధభాగంలో మరో నాలుగు గేమ్‌లు జరగనున్నాయి.
అంతకుముందు సెమీఫైనల్లో ప్రజ్ఞానంద 3.5-2.5తో తనకన్నా రేటింగ్‌లో మెరుగైన నెదర్లాండ్స్ గ్రాండ్‌మాస్టర్ అనీష్ గిరికి షాకిచ్చాడు. నాలుగు గేమ్‌ల ఈ సెమీస్ సమరంలో ప్రజ్ఞానంద-అనీష్ మొదట 2-2తో సమానంగా నిలిచారు. తొలి గేమ్ డ్రాగా ముగియగా.. రెండో గేమ్‌ను ప్రజ్ఞానంద నెగ్గి అనీష్‌కు ఈ టోర్నీలో తొలిసారి ఓటమి రుచి చూపించాడు. కానీ పుంజుకున్న అనీష్ మూడో గేమ్‌లో డ్రా చేసుకుని.. నాలుగో గేమ్‌ను గెలుచుకోవడంతో పోరు టైబ్రేకర్‌కు మళ్లింది. కానీ టైబ్రేకర్‌లో అనుభవజ్ఞుడైన అనీష్‌పై పైచేయి సాధించిన 16 ఏళ్ల ప్రజ్ఞానంద ఫైనల్‌కు దూసుకెళ్లాడు. టైటిల్ పోరులో డింగ్ లీరెన్ (చైనా)తో భారత స్టార్ తలపడనున్నాడు. అయితే ఒక టాప్ ఆటగాడిపై హోరాహోరీ గెలిచిన తర్వాత ఏ ఆటగాడైనా విశ్రాంతి తీసుకుంటాడు. కానీ ప్రజ్ఞానంద మాత్రం కళాశాలకు వెళ్లిపోయాడు. ఫైనల్ పరీక్షలు జరుగుతుండడమే ఇందుకు కారణం. కానీ ఆ తర్వాత కూడా అతడికి విశ్రాంతి కష్టమే. ఎందుకంటే డింగ్ లీరెన్‌తో ఫైనల్ ఉంది. అటు పరీక్షలు చూసుకుంటూ ఇటు టాప్ ఆటగాళ్ల పని పడుతున్నాడీ భారత టీనేజర్.
ఇదీ చదవండి:వేలంపాటలో రూ.20లక్షలకూ అమ్ముడుపోలేదు.. ఇప్పుడు అతడే హీరో..