చెస్ గ్రాండ్‌మాస్టర్ రాజారిత్విక్(Chess Grandmaster Rithvik met KTR) ప్రపంచ ఛాంపియన్(world champion)గా ఎదగాలని, రాష్ట్రానికి దేశానికి ఖ్యాతి తేవాలని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు(Telangana IT minister KTR) ఆకాంక్షించారు. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వపరంగా సంపూర్ణ చేయూతనిస్తామన్నారు. ఇటీవల గ్రాండ్‌మాస్టర్ హోదా సాధించిన తెలంగాణ యువకుడు రిత్విక్ శనివారం తన తల్లిదండ్రులతో ప్రగతిభవన్‌లో కేటీఆర్(chess grandmaster Rithvik met KTR)ను కలిశారు. ఆయనను మంత్రి అభినందిస్తూ, రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారని ప్రశంసించారు. రిత్విక్, ఆయన తల్లిదండ్రులు కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
రిత్విక్(chess grandmaster Rithvik) ఆరేళ్ల వయసులో తన తండ్రి చదరంగం ఆడుతుంటే చూసి తొలి చూపులోనే ఆ 64 గళ్లపై ప్రేమ పెంచుకున్నాడు. వేసవి శిక్షణ శిబిరంలో చదరంగం(chess)లో శిక్షణ ఇప్పిస్తే సత్తా చాటాడు. అప్పటి నుంచే చెస్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాడు. పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన రిత్విక్ కుటుంబంతో వరంగల్‌లో స్థిరపడగా.. మెరుగైన శిక్షణ కోసం హైదరాబాద్ వచ్చాడు. కోచ్ రామరాజు దగ్గర చేరి ఆటలో మరింత పట్టు సాధించాడు.
"గ్రాండ్‌మాస్టర్ కలను నిజం చేసుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. జులైలో అమ్మతో కలిసి ఐరోపా వచ్చా. రెండు జీఎం నార్మ్‌లతో పాటు ఎలో రేటింగ్ పెంచుకుని అనుకున్నది సాధించా. 2600 ఎలో రేటింగ్‌తో ఎలైట్ క్లబ్‌లో చేరడంతో పాటు ప్రపంచ ఛాంపియన్‌గా నిలవడమే నా తదుపరి లక్ష్యం"
- రిత్విక్, చెస్ గ్రాండ్‌మాస్టర్