తెలంగాణ

telangana

ETV Bharat / sports

Chess FIDE World Cup 2023 Final : డ్రాగా ముగిసిన చెస్​ ఫైనల్స్​.. మరోసారి తలపడనున్న ప్రజ్ఞానంద, మాగ్నస్

Chess FIDE World Cup 2023 Final : హోరాహోరీగా సాగిన ఫిడే ప్రపంచ కప్ ఫైనల్స్​ మొదటి గేమ్ 35 మూవ్స్​తో డ్రాగా ముగిసింది. దీంతో భారత చెస్ గ్రాండ్‌మాస్టర్ ఆర్ ప్రజ్ఞానానంద, ప్రపంచ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్‌సెన్ బుధవారం రెండో క్లాసికల్ గేమ్‌లో తలపడనున్నారు.

chess fide world cup 2023 final
chess fide world cup 2023 final

By ETV Bharat Telugu Team

Published : Aug 22, 2023, 7:39 PM IST

Chess FIDE World Cup 2023 Final : హోరాహోరీగా సాగిన ఫిడే ప్రపంచ కప్ ఫైనల్స్​ మొదటి గేమ్ ముగిసే సరికి 35 మూవ్స్​తో డ్రాగా డిక్లేర్​ అయ్యింది. దీంతో భారత చెస్ గ్రాండ్‌మాస్టర్ ఆర్ ప్రజ్ఞానానంద, ప్రపంచ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్‌సెన్ బుధవారం రెండో క్లాసికల్ గేమ్‌లో తలపడనున్నారు. ఇక ఈ గేమ్​లో మాగ్నస్.. వైట్‌ సైడ్​ బరిలోకి దిగనున్నట్లు ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ తెలిపింది.

Chess FIDE World Cup 2023 : సోమవారం జరిగిన సెమీస్‌లో మొదటి నుంచి అగ్రశ్రేణి ఆటగాడైన అమెరికా గ్రాండ్‌మాస్టర్‌ కరువానాకు గట్టి పోటీనిచ్చిన 18 ఏళ్ల ప్రజ్ఞానంద.. టైబ్రేక్‌లోనూ పట్టు వదలకుండా పోరాడాడు. మొదట తొలి రెండు క్లాసికల్‌ గేమ్‌లు డ్రా కావడం వల్ల పోరు టైబ్రేక్‌కు మళ్లిన సంగతి తెలిసిందే. సోమవారం టైబ్రేక్‌లో భాగంగా జరిగిన తొలి రెండు ర్యాపిడ్‌ గేమ్‌లు కూడా డ్రా అయ్యాయి. తొలి గేమ్‌లో నల్లపావులతో ఆడిన చెన్నై కుర్రాడు ప్రజ్ఞానంద 71 ఎత్తుల్లో డ్రా చేసుకున్నాడు. ఆ తర్వాత గేమ్‌లో తెల్లపావులతో ఆడి 53 ఎత్తుల్లో ప్రత్యర్థిని నిలువరించాడు. దీంతో ర్యాపిడ్‌లో రెండో రౌండ్‌కు తెరలేచింది.

తొలి గేమ్‌లో తెల్లపావులతో ప్రజ్ఞానంద ఆధిపత్యం చలాయించాడు. కరువానా నుంచి గట్టి సవాలును దాటుకుని 63 ఎత్తుల్లో విజయం సాధించాడు. ఈ గెలుపుతో ఆధిక్యంలోకి వెళ్లిన ప్రజ్ఞానంద.. ఆ తర్వాత రసవత్తరంగా సాగిన గేమ్‌ను 82 ఎత్తుల్లో డ్రా చేసుకుని ముందంజ వేశాడు. ఓవరాల్‌గా సెమీస్‌లో ప్రజ్ఞానంద 3.5-2.5 తేడాతో కరువానాపై నెగ్గాడు.

ఈ విజయంతో 2024 క్యాండిడేట్‌ టోర్నీలో చోటు ఖాయం చేసుకున్న ప్రజ్ఞానంద.. బాబి ఫిషర్‌, కార్ల్‌సన్‌ తర్వాత ఆ పోటీల్లో తలపడే మూడో పిన్న వయస్సు ఆటగాడిగా నిలిచాడు. అంతే కాకుండా 2005లో ప్రపంచకప్‌లో నాకౌట్‌ ఫార్మాట్‌ ప్రవేశపెట్టిన తర్వాత ఫైనల్‌ చేరిన తొలి భారత ఆటగాడు అతనే. అంతకుముందు లీగ్‌ కమ్‌ నాకౌట్‌ పద్ధతిలో జరిగిన ప్రపంచకప్‌ల్లో ఆనంద్‌ 2000, 2002లో టైటిల్‌ నెగ్గాడు.

ABOUT THE AUTHOR

...view details