తెలంగాణ

telangana

చెక్​మేట్ కొవిడ్: ఆనంద్​- హంపి విరాళాల సేకరణ

By

Published : May 11, 2021, 9:58 AM IST

Updated : May 11, 2021, 10:45 AM IST

కరోనాపై పోరులో తాము భాగమవుతామని ప్రకటించారు విశ్వనాథన్ ఆనంద్, కొనేరు హంపితో పాటు పలువురు భారత చెస్ క్రీడాకారులు. విరాళాల సేకరణకు ఆన్​లైన్​లో ప్రదర్శనలు ఇవ్వనున్నట్లు తెలిపారు.

anandcheckmate-covid-viswanathan-anand-koneru-humpy-to-help-support-coronavirus-relief-in-india
anandచెక్​మేట్ కొవిడ్: ఆనంద్​- హంపి విరాళాల సేకరణ

కొవిడ్​తో పోరాడుతున్న దేశానికి మద్దతు ప్రకటించారు భారత చెస్​ క్రీడాకారులు విశ్వనాథన్​ ఆనంద్, కొనేరు హంపి, ద్రోణవల్లి హరిక, నిహాల్​ సారిన్, ప్రజ్ఞానందా రమేష్​ బాబు. విరాళాల సేకరణకు ముందుకొచ్చారు. చెక్​మేట్​ కొవిడ్​ పేరుతో చెస్​.కామ్​లో వరుస ప్రదర్శనలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

"ఈ పోటీల్లో పాల్గొనాలనుకునే వారికి చెస్​.కామ్​ 2000 లోపు బ్లిట్జ్​ లేదా ఫైడ్​ ప్రమాణాలు ఉండాలి. రిజిస్ట్రేషన్​ ప్రక్రియ కోసం రూ.1838లు(25 డాలర్లు) చెల్లించాల్సి ఉంటుంది. ప్రపంచ మాజీ ఛాంపియన్​ ఆనంద్​తో పోటీలో పాల్గొనాలంటే రూ.11 వేలు(150 డాలర్లు) విరాళం ఇవ్వాల్సి ఉంటుందని" చెస్​.డామ్​ వెల్లడించింది.

“దేశంలో కొవిడ్ ధాటికి ప్రతి ఒక్కరూ ఏదో విధంగా ప్రభావితమయ్యారు. అందుకే వారికి అండగా ఉండేందుకు విరాళాలను సేకరించాలని అనుకున్నాం. దేశంలోని చాలా మంది కొవిడ్​ బారిన పడుతున్నారు. వారికి మద్దతుగా నిలిచేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. భారత గ్రాండ్​మాస్టర్​లతో పోటీ పడే అవకాశం ఉంది. చెస్​.కామ్​లో మీ విరాళాలు ఇచ్చి.. ఈ పోటీల్లో పాల్గొనాలని కోరుతున్నాం. గురువారం రాత్రి 7.30 గంటలకు చెక్​మేట్​ కొవిడ్ పేరుతో ఈ పోటీలు ప్రారంభమవుతాయి.”

-విశ్వనాథన్ ఆనంద్, భారత చెస్ ఆటగాడు.

ఇదీ చదవండి:ఐపీఎల్​ వాయిదాకు 'ప్రాక్టీస్ సెషన్లే' కారణమా?

Last Updated : May 11, 2021, 10:45 AM IST

ABOUT THE AUTHOR

...view details