అమెరికా కాలిఫోర్నియాలో ఓ బేస్బాల్ మ్యాచ్ సందర్భంగా అనూహ్య సంఘటన జరిగింది. తన ఫేవరెట్ జట్టుకు మద్దతు తెలిపే క్రమంలో ఓ యువతి హద్దుమీరి ప్రవర్తించింది. స్టేడియంలో ఉన్నవారికి తన వక్షోజాలను ప్రదర్శిస్తూ డాన్సులు వేసింది. దీంతో ఆమెను బలవంతంగా బయటకు గెంటేశారు అక్కడి సెక్యూరిటీ సిబ్బంది.
ఇదీ జరిగింది:జూన్ 4న లాస్ ఏంజెలెస్ డాడ్జర్స్, షికాగో వైట్ సాక్స్ మధ్య మ్యాచ్ సందర్భంగా ఈ సంఘటన జరిగింది. డాడ్జర్స్ జట్టుకు మద్దతు తెలపడానికి ఒకడుగు ముందుకేసి స్టేడియంలోనే తన వక్షోజాలను ప్రదర్శిస్తూ గంతులేసింది ఓ యువతి. ఆమె చర్యలకు భద్రతా సిబ్బంది వద్ద పలువురు ప్రేక్షకులు అభ్యంతరం వ్యక్తం చేయగా.. వారు ఆమెను బలవంతంగా బయటకు పంపించేశారు.