శ్రీలంక సంక్షోభ పరిస్థితుల కారణంగా ఆ దేశ క్రికెటర్లు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండు రోజులపాటు క్యూలైన్లలో ఉంటేనే తన కారుకు పెట్రోల్ కొట్టించుకోగలిగానని యువ ఆటగాడు చమిక కరుణరత్నే పేర్కొన్నాడు. దీంతో క్రికెట్ ప్రాక్టీస్‌కు కూడా వెళ్లలేకపోతున్నానని వాపోయాడు. ఓ ఛానల్‌తో చమిక మాట్లాడుతూ.. ''రెండు రోజుల నుంచి పెట్రోల్ కోసం వేచి ఉంటే ఇవాళ దొరికింది. భారీస్థాయిలో ఇంధన కొరత ఉండటంతో ప్రాక్టీస్‌కు కూడా వెళ్లలేకపోతున్నా'' అని చెప్పాడు. ప్రస్తుత సంక్షోభంలో శ్రీలంకకు భారత్ ఎంతో సాయంగా నిలిచిందని, తమకు సోదర దేశమని వ్యాఖ్యానించాడు.
ఓ వైపు శ్రీలంకలో సంక్షోభం కొనసాగుతున్నా.. ఇటీవలే ఆసీస్ జట్టు ఇక్కడ పర్యటించింది. ఇప్పుడు లంకతో పాకిస్థాన్ టెస్టు సిరీస్ ఆడుతోంది. వచ్చే నెలలో ఆసియా కప్ పోటీలకు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే ఆసియా కప్ నిర్వహణపై ఇప్పుడేమీ మాట్లాడలేనని, ఏం జరుగుతుందో వేచి చూడాలని చమిక పేర్కొన్నాడు. ''ఈ ఏడాది షెడ్యూల్ ప్రకారం ఆసియా కప్‌తోపాటు లంక ప్రీమియర్ లీగ్‌లు (ఎల్‌పీఎల్) ఉన్నాయి.