తెలంగాణ

telangana

ETV Bharat / sports

'కరోనా విజృంభిస్తే ఒలింపిక్స్​ రద్దు!' - కరోనా

ఈ ఏడాది తమ దేశంలో జరగాల్సిన ఒలింపిక్స్​ క్రీడలు రద్దు చేసే అవకాశం లేకపోలేదని జపాన్​ అధికార పార్టీ జనరల్​ సెక్రటరీ తోషిహిరో నికై చెప్పారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో క్రీడల నిర్వహణ కష్టమని భావిస్తే ఈ నిర్ణయం తీసుకోవచ్చని తెలిపారు.

Tokyo Olympics
ఒలింపిక్స్​

By

Published : Apr 15, 2021, 12:07 PM IST

జులై 23 నుంచి తమ దేశంలో మొదలవనున్న ఒలింపిక్స్​ను రద్దు చేసేందుకు అవకాశం లేకపోలేదని జపాన్​ అధికార డెమొక్రటిక్​ పార్టీ జనరల్ సెక్రటరీ తోషిహిరో నికై తెలిపారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో క్రీడలను నిర్వహించటం కష్టమని నిర్వహకులు భావిస్తే.. రద్దు చేసే అవకాశం ఉందని వెల్లడించారు. ఓ టెలివిజన్​ కార్యక్రమంలో నికై ఈ మేరకు అన్నారు.

టోక్యో వేదికగా ఓలింపిక్స్​ క్రీడలు.. గత ఏడాదిలోనే నిర్వహించాల్సి ఉంది. వైరస్ దృష్ట్యా 2021 జులైకి వాయిదాపడ్డాయి.

జపాన్​లో ఇప్పటివరకు 5 లక్షల 16వేల కేసులు నమోదయ్యాయి. 9,400 మంది మృతి చెందారు.

ఇదీ చదవండి:కరోనా కరుణిస్తేనే.. విశ్వక్రీడా సంబరం!

ABOUT THE AUTHOR

...view details