బ్రిటన్ ఫార్ములా వన్ రేసర్ లూయిస్ హామిల్టన్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ప్రపంచ ఛాంపియన్గా ఏడోసారి నిలిచాడు. ఆదివారం జరిగిన టర్కిష్ ప్రిక్స్ రేసులో విజేతగా నిలిచి ఈ ఘనత సాధించాడు. తన సహచర మెర్సీడెజ్ డ్రైవర్ వాల్టెరి బొటాస్ను ఓడించాడు.
ఈ విజయంతో జర్మనీ రేసర్ మైఖేల్ షుమాకర్ సాధించిన రికార్డును సమం చేశాడు హామిల్టన్. ఫార్ములా వన్ చరిత్రలో ఇతర డ్రైవర్ల కంటే హామిల్టన్ ఖాతాలో అత్యధిక విజయాలు, పోల్ స్థానాలు, పోడియం ముగింపులు ఉన్నాయి.