2032 ఒలింపిక్స్ ఆతిథ్య హక్కులను బ్రిస్బేన్‌కు కేటాయించింది అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం. ఐఓసీ 138వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. "35వ ఒలింపిక్స్ క్రీడలకు ఆతిథ్య హక్కులు దక్కించుకున్న బ్రిస్బేన్‌కు అభినందనలు" అని వెల్లడించింది. 2032 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి బ్రిస్బేన్‌ను ప్రతిపాదించాలని ఐఓసీ(IOC) ఎగ్జిక్యూటివ్ బోర్డు జూన్‌లోనే నిర్ణయించింది.
బ్రిస్బేన్ వేదికగా 2032 ఒలింపిక్స్ - brisbane olympics
2032 ఒలింపిక్స్‌ను బ్రిస్బేన్‌లో నిర్వహించనున్నట్లు అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం ప్రకటించింది. చివరిసారిగా 2000 సంవత్సరంలో సిడ్నీ విశ్వక్రీడలకు వేదిక కాగా.. తిరిగి 32 ఏళ్ల తర్వాత మరోసారి ఆస్ట్రేలియాకు ఈ సువర్ణావకాశం దక్కింది.
బ్రిస్బేన్, 2032 ఒలింపిక్స్
1956 విశ్వక్రీడలను మెల్బోర్న్ వేదికగా నిర్వహించగా.. 2000 సంవత్సరంలో సిడ్నీలో మరోసారి మెగా ఈవెంట్ జరిపారు. 32 ఏళ్ల అనంతరం మరోసారి ఆస్ట్రేలియాలో ఒలింపిక్స్ జరగనున్నాయి. ఇక 2024 ఒలింపిక్స్‌కు పారిస్ ఆతిథ్యమివ్వనుండగా.. 2028లో లాస్ ఏంజెల్స్ వేదికగా ఈ మెగా క్రీడలు జరగనున్నాయి.
Last Updated : Jul 21, 2021, 3:05 PM IST