తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆ జట్టును బురిడీ కొట్టించి.. ఫిఫా చరిత్రలోనే గ్రేటెస్ట్​గా నిలిచిన​ గోల్​ ఇదే! - 1970 fifa worldcup greatest goal

ఖతార్​ వేదికగా ప్రారంభమైన ఫిఫా ప్రపంచకప్​ ఆసక్తికరంగా సాగుతోంది. అయితే ఈ ఫిఫా చరిత్రలో గ్రెటెస్ట్​గా నిలిచిన ఓ గోల్​ గురించే ఈ కథనం.

greatest Goal in  Fifa Worldcup
ఆ జట్టును బురిడీ కొట్టించి.. ఫిఫా చరిత్రలోనే గ్రేటెస్ట్​గా నిలిచిన​ గోల్​ ఇదే!

By

Published : Nov 22, 2022, 3:54 PM IST

ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ గెలవాలంటే ప్రతి ఆటగాడు అద్భుతంగా ఆడితీరాల్సిందే. అలా బ్రెజిల్‌ జట్టులోని ప్రతి ప్లేయర్​ అద్భుతంగా ఆడటంతో ఆ టీమ్​ ఇటలీని ఓడించి 1970లో ప్రపంచకప్‌ను ముద్దాడింది‌. అయితే ఈ మ్యాచ్‌లో ఓ గోల్‌ ఫిఫా చరిత్రలోనే గ్రేటెస్ట్‌గా నిలిచిపోతుంది. దిగ్గజ ఆటగాడు పీలే అందించిన పాస్‌తో ఈ గోల్‌ను బ్రెజిల్‌ కెప్టెన్‌ కార్లోస్‌ అల్బెర్టో కొట్టాడు. అతడికి బంతిని అందించడానికి దాదాపు ఏడుగురు బ్రెజిల్‌ ఔట్‌ఫీల్డ్‌ ఆటగాళ్లు 10సార్లు పాస్‌ చేయాల్సి వచ్చింది.

ఈ గోల్‌ పాస్‌ల్లో భాగస్వాములైన ఆటగాళ్లలో టోస్టావో, బ్రిటో, క్లోడో అల్డో, పీలే, గెర్సన్‌, రెవిల్లినో, జార్జిన్హో ఉన్నారు. కోల్డోఅల్డో ఏకంగా నలుగురు ఇటలీ ఆటగాళ్లను బురిడీ కొట్టించి బంతిని చాకచక్యంగా బ్రెజిల్‌ ఆటగాడికి పాస్‌ చేశాడు. అక్కడి నుంచి బంతిని అందుకొన్న పీలే దానిని కెప్టెన్‌ అల్బెర్టో వద్దకు చేర్చాడు. అల్బెర్టో గోల్‌పోస్టులోకి పంపాడు. మైదానంలో ఇటలీ ఆటగాళ్లు ప్రేక్షకుల్లా మిగిలిపోయారు. గోల్‌కు దాదాపు 47 సెకన్ల ముందు ఇటలీ వైపు పొజిషన్‌తో మొదలై.. చివరికి వారి గోల్‌పోస్టులోనే బంతి పడటంతో ముగుస్తుంది. 2002లో ఇంగ్లాండ్‌ నిర్వహించిన సర్వేలో 100 అత్యుత్తమ క్రీడా స్మృతుల్లో దీనికి 36వ స్థానం కల్పించారు. 1970 ప్రపంచకప్‌ అనంతరం పుట్‌బాల్‌ లెజెండ్‌ పీలే రిటైర్మెంట్‌ ప్రకటించారు.

ఇదీ చూడండి:ఫిఫా వరల్డ్​కప్​.. కేరళలో ఫ్యాన్స్​ ఫైట్​.. ఇనుప రాడ్లతో తలలు పగిలేలా..

ABOUT THE AUTHOR

...view details