ఆసియా ఒలింపిక్స్ బాక్సింగ్ క్వాలిఫయర్స్‌లో.. భారత ఆటగాళ్లు సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. నేటి నుంచి జోర్డాన్‌లోని అమ్మాన్ వేదికగా ఈ టోర్నీ ప్రారంభం కానుంది. 63 స్థానాలకు జరుగుతున్న పోటీల్లో.. టోక్యో బెర్త్ కోసం 13 మంది భారత బాక్సర్లు బరిలోకి దిగుతున్నారు. ఈ మెగాటోర్నీలో సెమీస్‌కు చేరిన బాక్సర్లు టోక్యో బెర్త్ ఖరారు చేసుకోనున్నారు.
తాజాగా ఇందుకోసం ప్రకటించిన జాబితాలో భారత స్టార్, ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్ మేరీ కోమ్‌కు రెండో సీడింగ్ లభించింది. ఆమె మహిళల 51 కేజీల విభాగంలో ఫేవరెట్‌గా ఉంది.
గత ఏడాది ప్రపంచ బాక్సింగ్‌లో రజతం గెలిచి చరిత్ర సృష్టించిన అమిత్ ఫంగాల్ (52 కేజీలు)కు పురుషుల విభాగంలో టాప్ సీడింగ్ దక్కింది. కామన్వెల్త్ మాజీ ఛాంపియన్ వికాస్ కృష్ణన్‌తో పాటు రెండుసార్లు ప్రపంచ కాంస్య పతక విజేత లవ్లీనా (69 కేజీలు), పూజ (75 కేజీలు) తదితరులు ఈ టోర్నీలో ఆడుతున్నారు. మొత్తం భారత్ నుంచి ఎనిమిది మంది పురుషులు, ఐదుగురు మహిళా బాక్సర్లు బరిలోకి దిగుతున్నారు.