తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆ ఘనత సాధించిన తొలి భారత బాక్సర్ - vijendar

ప్రపంచ బాక్సింగ్​ ఛాంపియన్​షిప్​లో ఫైనల్​ చేరిన అమిత్ పంగల్.. ఈ ఘనత సాధించిన తొలి భారత బాక్సర్​గా నిలిచాడు. మరో బాక్సర్ మనీశ్ కౌశిక్ కాంస్యంతో సరిపెట్టుకున్నాడు

ప్రపంచ ఛాంపియన్​షిప్​ ఫైనల్లో భారత బాక్సర్ అమిత్ పంగల్

By

Published : Sep 20, 2019, 4:49 PM IST

Updated : Oct 1, 2019, 8:31 AM IST

రష్యా వేదికగా జరుగుతున్న ప్రపంచ బాక్సింగ్​ ఛాంపియన్​షిప్​లో భారత బాక్సర్​ అమిత్ పంగల్ అరుదైన ఘనత సాధించాడు. సెమీస్​లో కజికిస్థాన్​కు చెందిన సాకెన్ బిబోస్నివ్​ను ఓడించి ఫైనల్​లో అడుగుపెట్టిన తొలి భారత బాక్సర్​గా నిలిచాడు. శనివారం జరిగే తుదిపోరులో ఉజ్బెకిస్థాన్​కు చెందిన సకోబిడిన్​ జోయిరావ్​తో తలపడనున్నాడు. సెమీస్​లో జరిగిన మరో మ్యాచ్​లో భారత్​కు చెందిన మనీశ్​ కౌశిక్ ఓటమిపాలై కాంస్యం సాధించాడు.

2017 ఆసియన్ ఛాంపియన్​షిప్​లో 49 కిలోల విభాగంలో కాంస్య పతకం సాధించాడు అమిత్. అదే ఏడాది జరిగిన ప్రపంచ ఛాంపియన్​షిప్​లోనూ క్వార్టర్స్​ వరకు వెళ్లాడు. ఆ తర్వాత జరిగిన ప్రఖ్యాత స్ట్రాంజా మెమోరియల్, ఆసియా క్రీడల్లో వరుసగా బంగారు పతకాలు సొంతం చేసుకుని తానెంటే నిరూపించాడు. ఈ ఏడాది ఆసియన్ ఛాంపియన్​షిప్​లో స్వర్ణం గెలిచిన తర్వాత.. 52 కిలోల విభాగంలోకి మారాడు అమిత్. వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్​ కోసం సిద్ధమవుతున్నాడు.

ప్రపంచ ఛాంపియన్​షిప్​ ఫైనల్లో భారత బాక్సర్ అమిత్ పంగల్

ఈ టోర్నీలోని ఒక ఎడిషన్​లో ఇప్పటివరకు ఒకటి కంటే ఎక్కువ పతకాలు సాధించలేదు భారత్. కానీ ప్రస్తుత సీజన్​లో సెమీస్​లోకి అడుగుపెట్టిన బాక్సర్లు అమిత్, మనీశ్ ఆ రికార్డును తిరగరాశారు. వరల్డ్​ మీట్​లో ఇప్పటివరకు భారత్​ నుంచి విజేందర్ సింగ్(2009), వికాశ్ క్రిష్ణన్(2011), శివ థాపా(2015), గౌరవ్ బిదూరి(2017) మాత్రమే పతకాలు సాధించారు.

ఇది చదవండి: బాక్సింగ్ ఛాంపియన్​షిప్​లో భారత బాక్సర్లు రికార్డు

Last Updated : Oct 1, 2019, 8:31 AM IST

ABOUT THE AUTHOR

...view details