ఐబా ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్ (Boxing World Championships) భారత్‌కు తొలి పతకం ఖాయమైంది. అరంగేట్రంలోనే యువ బాక్సర్ ఆకాశ్ కుమార్ (Akash Kumar Boxer) సెమీస్‌లోకి ప్రవేశించాడు. మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో (54కేజీ) వెనిజులాకు చెందిన ఒలింపిక్ రజత పతక విజేత ఫినోల్ రివాస్పై 5-0తో అద్భుత విజయం సాధించాడు.
ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు తొలి పతకం - ఐబా
ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో (Boxing World Championships) సెమీస్‌లోకి అడుగుపెట్టాడు భారత యువ బాక్సర్ ఆకాశ్ కుమార్. దీంతో ఈ టోర్నమెంట్లో భారత్‌కు తొలి పతకం ఖాయమైంది.
ఆకాశ్ కుమార్
21ఏళ్ల ఆకాశ్.. గురువారం, సెమీఫైనల్లో కజికిస్థాన్కు చెందిన మఖ్మూద్ సబీర్ఖాన్తో తలపడనున్నాడు. ఈ విజయంతో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పతకం సాధించిన ఏడో భారత బాక్సర్‌గా ఆకాశ్ నిలిచాడు.
ఇదీ చూడండి:బీచ్ హ్యాండ్‌బాల్‌లో బికినీ రూల్‌కు చెల్లు