దిగ్గజ బాక్సర్ మైక్ టైసన్.. ఎంతటి మహాబలుడో.. అతను ఫామ్‌లో ఉన్నప్పుడు ఎలాంటి ప్రత్యర్థినైనా ఎలా మట్టి కరిపించాడో క్రీడా ప్రేమికులకు బాగా తెలుసు. కానీ 54 ఏళ్ల వయసులో ఒక ఛారిటీ మ్యాచ్ కోసం మళ్లీ రింగ్‌లోకి దిగున్న ఈ యోధుడు.. ఊహించని రీతిలో కష్టపడుతున్నాడు.
బౌట్ కోసం విద్యుత్ తీగలతో టైసన్ ప్రాక్టీస్ - boxing legend mike tyson
పదిహేనేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ రింగ్‌లోకి అడుగుపెడుతున్నాడు బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్. సెప్టెంబరు 12న జరగనున్న ఓ ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో టైసన్ పాల్గొననున్నాడు. అయితే ఈ పోరు సన్నాహాల్లో భాగంగా ఎలక్ట్రికల్ స్టిములేషన్ పరికరం సాయంతో.. కండరాల వ్యాయామం చేస్తున్నాడు టైసన్. ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
ఆగస్టు 12న రాయ్ జోన్స్‌తో జరగబోయే బౌట్ కోసం అతను శరీరానికి విద్యుత్ తీగలను పెట్టుకొని కండరాలు ఉత్తేజం పొందేలా వ్యాయామం చేస్తున్నాడు. ఎలక్ట్రికల్ మజిల్ స్టిములేషన్ లేకుండా తాను మునుపటిలా పోటీపడలేనని... అందుకే జోన్స్‌తో బౌట్‌కు ఇలా సిద్ధమవుతున్నానని టైసన్ చెప్పాడు. మైక్ ట్రైనింగ్ అవుతున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతం అవుతున్నాయి.
1986లో 20 ఏళ్ల వయసులోనే టైసన్ హెవీ వెయిట్ ఛాంపియన్‌గా నిలిచాడు. కెరీర్లో ఎన్నో మరుపురాని విజయాలు సాధించాడు. 2005లో చివరి బౌట్లో తలపడ్డాడు. పునరాగమనంలో అతను తలపడబోయే రాయ్‌జోన్స్.. 4-డివిజిన్ ఛాంపియన్.