తెలంగాణ

telangana

ETV Bharat / sports

జులైలో ఇండియన్​ బాక్సర్ల పంచులు షురూ! - BFI

ఇండియన్ బాక్సింగ్ లీగ్ జులై - ఆగస్టులో నిర్వహించనున్నట్లు భారత బాక్సింగ్ ఫెడరేషన్ ప్రకటించింది. భారత బాక్సర్లతో పాటు విదేశీ క్రీడాకారులు కూడా ఈ లీగ్​లో ఆడనున్నారు.

బాక్సింగ్

By

Published : Apr 30, 2019, 7:51 PM IST

ఐపీఎల్ తరహాలో ఇండియన్ బాక్సింగ్​ లీగ్ రాబోతుంది. ఈ విషయాన్ని భారత బాక్సింగ్ ఫెడరేషన్(బీఎఫ్​ఐ) నేడు ప్రకటించింది. ఈ ఏడాది జులై - ఆగస్టు నుంచి బాక్సింగ్​ లీగ్​ నిర్వహించే అవకాశముంది.

2017 నుంచి బాక్సింగ్​ లీగ్ నిర్వహించాలని బీఎఫ్​ఓఐ ఆలోచిస్తుంది. ఇప్పుడు ఈ అంశంపై ముందడుగేసింది. భారత బాక్సర్లు అమిత్ పంఘాల్​, శివథాపా, సరిత దేవిలతో పాటు విదేశీ క్రీడాకారులు కూడా ఈ పోటీలో ఆడనున్నారు.

ఈ టోర్నమెంట్ మూడు వారాల పాటు జరుగనుంది. ఫ్రాంఛైజీ యాజమానులను, టైటిల్​ స్పాన్సర్లను త్వరలో ప్రకటిస్తామని లీగ్ నిర్వహించబోయే స్పోర్ట్స్ లైవ్ కంపెనీ అతుల్ పాండే తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details