తెలంగాణ

telangana

ETV Bharat / sports

సాయ్​లో బాక్సర్లకు శిక్షణ పునఃప్రారంభం - బాక్సర్లుకు శిక్షణ ప్రారంభించిన శాయ్​

పురుష బాక్సర్లు వికాస్​, నీరజ్​, సతీష్​లు ప్రస్తుతం బళ్లారిలోని జెఎస్​డబ్ల్యూ సెంటర్​లో శిక్షణ ప్రారంభించారు. పటియాలాలోని జాతీయ క్రీడా సంస్థలో మరో తొమ్మిది మంది పురుష బాక్సర్లు ప్రాక్టీసు చేస్తున్నారు. ఇప్పటికే మహిళా బాక్సర్లు ప్రాక్టీసును జులై 21 నుంచి తిరిగి ప్రారంభించారు.

Boxer Vikas, Neeraj and Satish cleared to resume training
సాయ్​లో బాక్సర్లకు శిక్షణ పునఃప్రారంభం

By

Published : Jul 26, 2020, 3:00 PM IST

ఏడు రోజుల నిర్బంధం తర్వాత పురుష బాక్సర్లు సోమవారం నుంచి వారి శిక్షణను తిరిగి ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే జులై 21 నుంచి పటియాలాలోని జాతీయ క్రీడా సంస్థలో మహిళా బాక్సర్లు ప్రాక్టీసును పునఃప్రారంభించారు.

మహిళలతో పాటే పురుషులకు శిక్షణ ప్రారంభించాలనుకున్నా.. ఓ వైద్యుడికి కరోనా సోకిన దృష్ట్యా విరివిగా ప్రాక్టీసును ప్రారంభించారు. కుట్టప్ప (పురుషుల), మహ్మద్​ అలీ కమర్​ (మహిళలు), చోటే లాల్​లు కూడా దిగ్బంధ కాలాన్ని పూర్తి చేసుకున్నారు.

స్పోర్ట్స్​ అథారిటీ ఆఫ్​ ఇండియా (శాయ్​)

పరిపాలన విభాగంలో దిద్దుబాటు

ప్రపంచ ఛాంపియన్​షిప్​ పతక విజేత వికాస్ క్రిష్ణన్,​ ​ప్రొఫెషనల్​ బాక్సర్​ నీరజ్​ గోయాత్​, ఆసియాడ్​ పతక విజేత సతీష్​ కుమార్​ బాక్సర్లు నిర్బంధ నిబంధనల ఉల్లంఘనపై శాయ్​ ఇటీవలే నివేదిక సమర్పించింది. అయితే బాక్సర్లు తమ తప్పును అంగీకరించారని..భారత క్రీడా ప్రాధికార సంస్థ కార్యదర్శి రోహిత్​ భరద్వాజ్​ నేతృత్వంలోని విచారణ ప్యానెల్​ ప్రవర్తన అనుచితంగా ఉందని శాయ్​ తెలిపింది. దీంతో పటియాలాలోని స్థానిక పరిపాలన విభాగంలో దిద్దుబాటు చర్యలకు సిఫారసు చేసింది శాయ్​.

నిబంధనలను పాటించాలి

వికాస్​, నీరజ్​, సతీష్​లు ప్రస్తుతం బళ్లారిలోని జెఎస్​డబ్ల్యూ సెంటర్​లో శిక్షణలో ఉండగా.. పటియాలాలో మరో తొమ్మిది మంది పురుష బాక్సర్లు ప్రాక్టీసు చేస్తున్నారు. కమిటీ సిఫారసుల ఆధారంగా.. నిర్బంధ వ్యవధి పూర్తి చేసుకుని శిక్షణలో అడుగుపెట్టబోయే ముందు రాష్ట్ర ప్రభుత్వ, శాయ్​ జారీ చేసిన ఆరోగ్య మార్గదర్శకాలను క్రీడాకారులు కచ్చితంగా పాటించి తీరాలని నిర్ణయించారు.

కమిటీ చేసిన సిఫారసులు

  1. కరోనా నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వ, ఎస్ఓపీ నిర్దేశించిన మార్గదర్శకాలతో పాటు నిర్బంధ నిబంధనలను కఠినంగా అమలు చేయడం.
  2. నిర్బంధ నిబంధనల గురించి అథ్లెట్లు, కోచ్​లకు ఓ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం.. క్వారంటైన్​ పూర్తైన తర్వాత శిక్షణా కేంద్రంలోకి తిరిగి అడుగుపెట్టడం వంటి చర్యలకు సంబంధించి పూర్తి ప్రణాళికను చేపట్టడం.
  3. అన్ని వాటాదారులకు క్రమంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం.
  4. శిక్షణా శిబిరాలను పర్యవేక్షించడానికి ఓ ప్రత్యేక అధికారి నియామకం. ఈ అధికారి ద్వారా కోచ్​లు, అథ్లెట్లకు పూర్తి ప్రణాళికా పద్ధతి గురించి సమాచారాన్ని, నిర్ణయాలను తెలియజేయడం.

ABOUT THE AUTHOR

...view details