తెలంగాణ

telangana

ETV Bharat / sports

మేరీకోమ్​పై నాకేం కోపం లేదు: బాక్సర్ నిఖత్ - మేరీకోమ్

తెలంగాణ యువ బాక్సర్​ నిఖత్​ జరీన్.. దిగ్గజ బాక్సర్​ మేరీకోమ్​తో జరిగిన వివాదంపై స్పందించింది. గతంలో తాను ఒలింపిక్స్​ అర్హత పోటీల్లో పాల్గొనేందుకు ట్రయల్స్​ మాత్రమే నిర్వహించాలని పోరాటం చేశానని చెప్పింది. తనకు మేరీకోమ్​పై ఎలాంటి కోపం లేదని స్పష్టం చేసింది.

boxer nikhat
నిఖత్

By

Published : Nov 20, 2020, 5:30 AM IST

ఒలింపిక్స్‌ అర్హత టోర్నీలో పాల్గొనే అవకాశం కోసం హైదరబాదీ యువ బాక్సర్​ నిఖత్​ జరీన్.. స్టార్​ బాక్సర్​ మేరీకోమ్​ మధ్య గతేడాది గట్టి వివాదమే జరిగింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు వీరిద్దరి మధ్య 51 కేజీల విభాగంలో సెలక్షన్​ ట్రయల్స్​ను​ నిర్వహించింది భారత బాక్సింగ్​ సమాఖ్య. ఇందులో మేరీకోమ్​ విజేతగా నిలిచి ఒలింపిక్స్​ బెర్త్​ ఖరారు చేసుకుంది. అయితే తాజాగా ఈ విషయంపై మాట్లాడింది నిఖత్​. తనకు మేరీకోమ్​పై ఎలాంటి కోపం లేదని చెప్పింది.

"నిజానికి నేను ఎవరితో గొడవ పడాలని, వివాదాన్ని పెద్దది చేయాలని అనుకోలేదు. ఒలింపిక్స్​ అర్హత పోటీల్లో పాల్గొనేందుకు నేను అర్హురాలని భావించాను. అందుకోసం ట్రయల్స్ నిర్వహించాలని​ పోరాడాను. నాకు ఎవరిపైనా కోపం లేదు."

-నిఖత్​ జరీన్​, బాక్సర్​.

టోక్యో ఒలింపిక్స్​కు మేరీకోమ్​ అర్హత సాధించడం తనకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పింది నిఖత్​. తాను బంగారు పతకాన్ని సాధించాలని ఆశిస్తున్నట్లు తెలిపింది.

ఇదీ చూడండి : 'ఇంటికి రంగులేశా.. అమ్మకు సాయం చేస్తున్నా'

ABOUT THE AUTHOR

...view details