కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని టార్గెట్ ఒలింపిక్ పోడియం (టాప్) పథకంలో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్‌కు చోటు దక్కింది. వచ్చే ఏడాది ఒలింపిక్స్‌ను దృష్టిలో పెట్టుకుని అగ్రశ్రేణి క్రీడాకారులతో భారత క్రీడాప్రాధికార సంస్థ (సాయ్) 'టాప్' జాబితాను విడుదల చేసింది. మేరీ కోమ్కు స్టాండ్‌బైగా నిఖత్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
'టాప్'లో నిఖత్.. మేరీ కోమ్కు స్టాండ్‌బైగా! - నిఖత్ జరీన్ తాజా వార్తలు
కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని 'టాప్' పథకంలో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్‌కు చోటు దక్కింది. దీనిపై శాట్స్ ఛైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.
టాప్‌లో నిఖత్ జరీన్
బ్యాడ్మింటన్‌లో తెలుగు రాష్ట్రాల నుంచి పి.వి.సింధు, సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్, సిక్కిరెడ్డి, సాత్విక్ సాయిరాజులు 'టాప్'లో చోటు సంపాదించారు. 'టాప్'లో నిఖత్‌కు చోటు దక్కడం శుభపరిణామమని శాట్స్ ఛైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు.
Last Updated : Sep 18, 2020, 7:25 AM IST