Boxer Lovlina News: ఒలింపిక్స్ కాంస్య పతక విజేత బాక్సర్ లవ్లీనాకు డీఎస్పీ బాధ్యతలను అప్పగించింది అసోం ప్రభుత్వం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ.. లవ్లీనా భవిష్యత్తులో ఎస్పీ కూడా అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. డీఎస్పీ పదవికి సంబంధించిన అపాయింట్మెంట్ లెటర్‌ను లవ్లీనాకు అందజేశారు.
టోక్యో ఒలింపిక్స్‌లో లవ్లీనా పతకం సాధించడం రాష్ట్రానికే గర్వకారణమని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అన్నారు. ఇప్పటినుంచి బాక్సర్‌కు నెల జీతంతో పాటు ట్రైనింగ్ కోసం అదనంగా రూ. 1 లక్ష ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. గువాహటిలోనే ఆమె బాక్సింగ్ ట్రైనింగ్ తీసుకునేలా ఏర్పాట్లు చేస్తామని, అంతర్జాతీయ కోచ్‌ను నియమిస్తానని హామీ ఇచ్చారు. ఆ ప్రాంతంలో ఓ రోడ్డుకు కూడా లవ్లీనా పేరు పెడతామని చెప్పారు.
పోలీస్ శాఖకు ధన్యవాదాలు..